Share News

‘పులివెందుల’ మార్క్‌ గూండాగిరి

ABN , Publish Date - Nov 20 , 2026 | 03:33 AM

మాజీ సీఎం జగన్‌ సొంత జిల్లా కడప లో 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తొలి దశ ప్రశాంతంగా జరిగింది.

‘పులివెందుల’ మార్క్‌ గూండాగిరి

  • పంచాయతీ ఎన్నికల నామినేషన్లలో రెచ్చిపోయిన వైసీపీ రౌడీలు, గూండాలు

కడప/పులివెందుల, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్‌ సొంత జిల్లా కడప లో 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తొలి దశ ప్రశాంతంగా జరిగింది. రెండో దశలో పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల్లోని పంచాయతీల నామినేషన్ల ప్రక్రియ సం దర్భంగా వైసీపీ మార్క్‌ రౌడీయిజం, గూండాయిజానికి తెరలేపి దాడులకు తెగబడ్డారు. గురువారం ఏకంగా రాళ్లు, పెట్రోల్‌బాంబులతో వైసీపీ మూక చెలరేగిపోయింది. నామినేషన్‌ కేంద్రాన్ని స్వాధీనం చేసుకుంది.

నాడు రెచ్చిపోయిన వారే..:

మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వైసీపీ నేతలు కొందరు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. అయితే, పోలీసులు ఎవరినీ అరెస్టు చే యలేదు. ఆయా కేసుల్లోని కొందరు వైసీపీ నేత లు పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సమయంలో విధ్వంసం సృష్టించారు. గురువారం నామినేషన్లు వేసేందుకు తొండూరు మండలం సంతకొవ్వూరు నుంచి వైసీపీ నాయకులు తమ మద్దతుదారులను వెంటబెట్టుకుని అగడూరులోని నామినేషన్‌ కేంద్రం వద్దకు చేరుకున్నారు.

అక్కడ టీడీపీ వారు నామినేషన్‌ వేస్తున్నారని, వైసీపీ వారిని వేయనిచ్చే పరిస్థితి లేదని వారంతట వారే ఊహించుకుని వెనక్కి వెళ్లారు. కాసేపటికి 500 మందితో ఆరు ట్రాక్టర్లు, వందకు పైగా బైకులపై అగడూరు గ్రామ శివార్లలోకి చేరుకున్నారు. ఈ సమయంలో సింహాద్రిపురం మార్కెట్‌ యార్డు చైర్మన్‌ బండి రామసూరారెడ్డి, మరికొందరు టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. వారి పై వైసీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. రామసూరారెడ్డికి గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో కడపకు తరలించారు. వైసీపీ మూకలు నామినేషన్‌ కేంద్రాన్ని ఆక్రమించుకున్నాయి. ఆ పార్టీ మద్దతుదారులంతా నామినేషన్లు దాఖలు వేశారు.


రాజారెడ్డి పాలన తెస్తున్నారు: బీటెక్‌ రవి

‘‘వైసీపీ చేతిలోంచి పులివెందుల జారిపోతోందని వారికి స్పష్టంగా అర్థమైంది. అందుకే అరాచకాలకు పాల్పడుతున్నారు.’’ అని పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్‌ రవి, ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలను నిలువరించాలని డిమాండ్‌ చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. పులివెందులలో రాజారెడ్డి పాలన మళ్లీ తెస్తున్నారని అన్నారు. డీఐజీ కోయ ప్రవీణ్‌ చేరుకుని రవితో చర్చించారు. దాడులు చేసిన వారిని అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో రవి ధర్నా విరమించారు.

ఏపీ తీరానికి అక్వాన్ తుపాను ముప్పు.. గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం: ఏపీఎస్‌డీఎంఏ

ఎంపీపీ ఎన్నికల్లోనూ కూటమి హవా

Updated Date - Nov 20 , 2026 | 03:45 AM