Share News

కాటికి వెళ్లాలంటే.. చచ్చినంత పనే!

ABN , Publish Date - Sep 25 , 2026 | 05:57 AM

విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెదకాదలో చనిపోయిన వ్యక్తులను శ్మశానానికి తీసుకెళ్లడం అంటే బంధువులకు చచ్చినంత పనే!

కాటికి వెళ్లాలంటే.. చచ్చినంత పనే!

విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెదకాదలో చనిపోయిన వ్యక్తులను శ్మశానానికి తీసుకెళ్లడం అంటే బంధువులకు చచ్చినంత పనే!. గ్రామానికి చెందిన సామిరెడ్డి పరదేశమ్మ (65), మంగిరెడ్డి లక్ష్ముంనాయుడు (62) గురువారం అనారోగ్యంతో చనిపోయారు. వారికి దహన సంస్కారాలు నిర్వహించాలంటే ఏడొంపుల గెడ్డ (వాగు) ఆవల ఉన్న శ్మశాన వాటికకు తీసుకెళ్లాలి. భారీ వర్షాలకు గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గ్రామస్థులు మొలలోతు నీటిలో... మృతదేహాలను మోసుకుంటూ వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. వాగు మీద చిన్నపాటి వంతెన నిర్మించాలని వారు కోరుతున్నారు.

- దత్తిరాజేరు, ఆంధ్రజ్యోతి

ఈ వార్తలనూ చదవండి...

మహిళల భద్రతకు ప్రాధాన్యం

బజార్‌లో పోస్టుల అమ్మకం

Updated Date - Sep 25 , 2026 | 05:57 AM