Share News

7 రోజుల్లో కోట్ల విక్రయాలు

ABN , Publish Date - Oct 22 , 2026 | 04:47 AM

విజయవాడ పున్నమి ఘాట్‌లో నిర్వహిస్తున్న జాతీయ సరస్‌ మేళాకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోంది. తొలి సారిగా ఢిల్లీ కాకుండా ఇతర ప్రాంతంలో నిర్వహిస్తున్న ఈ మేళాకు విజయవాడ ఆతిథ్యం ఇస్తోంది.

7 రోజుల్లో కోట్ల విక్రయాలు

  • విజయవాడ సరస్‌ మేళాకు అపూర్వ స్పందన

  • తొలి వారంలో 9 లక్షల మంది సందర్శన

  • పశ్చిమబెంగాల్‌, యూపీ, ఏపీ స్టాల్స్‌ల్లో రద్దీ

విజయవాడ, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): విజయవాడ పున్నమి ఘాట్‌లో నిర్వహిస్తున్న జాతీయ సరస్‌ మేళాకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోంది. తొలి సారిగా ఢిల్లీ కాకుండా ఇతర ప్రాంతంలో నిర్వహిస్తున్న ఈ మేళాకు విజయవాడ ఆతిథ్యం ఇస్తోంది. దేశంలోని వివిధ రకాల వస్తువులకు ఒకే వేదికైన సరస్‌ మేళా ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ నెల 15న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రారంభమై నెలాఖరు వరకు జరిగే మేళాలో హ్యాండ్‌లూమ్స్‌, హ్యాండీక్రాఫ్ట్స్‌, టెక్స్‌టైల్స్‌, సేంద్రియ ఆహార ఉత్పత్తులతోపాటు ఇతర వస్తువుల విక్రయాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. గడిచిన ఏడు రోజుల్లో రూ.7 కోట్ల విక్రయాలు జరిగాయని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. 33 రాష్ట్రాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు.. వారు తయారు చేసిన ఉత్పత్తులను 579 స్టాల్స్‌లో విక్రయిస్తున్నారు.

బుధవారం వరకు 9 లక్షల మంది సరస్‌ మేళాను సందర్శించారని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ప్రతి రోజు సగటున 1.25 లక్షల మంది వస్తున్నారు. సెలవు రోజుల్లో సందర్శకుల సంఖ్య 2 లక్షలు దాటుతోంది. కలంకారీ దుస్తులు, ఊలు వస్తువులు, అల్లికలు, కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, లెదర్‌, వెదురు వస్తువులకు మంచి డిమాండ్‌ ఉంటోంది. ప్రధానంగా పశ్చిమబెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక్కో హ్యాండ్‌లూమ్‌ స్టాల్‌లో ప్రతి రోజూ సగటున రూ.1.80 లక్షల బిజినెస్‌ జరుగుతోంది. కడప పట్టుచీరలు, అనకాపల్లి మాడుగుల హల్వా, కోనసీమ పట్టుచీరలు, తెలంగాణ హ్యాండ్‌ లూమ్స్‌, కేరళ హస్తకళలు, బిహార్‌ హ్యాండ్‌లూమ్‌ స్టాల్స్‌లో అత్యధిక విక్రయాలు జరుగుతున్నాయి.


వీటితోపాటు ఇండియా ఫుడ్‌ కోర్ట్‌ ఆహార ప్రియులను అమితంగా ఆకర్షిస్తోంది. వివిధ రాష్ట్రాల ఫుడ్‌ను స్థానిక ప్రజలకు పరిచయం చేసేందుకు 50 స్టాల్స్‌ను కేటాయించారు. వీటిల్లో రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌కు చెందిన బేల్‌పూరి, పావ్‌బాజీ స్టాల్స్‌లో రోజూ రూ.లక్షకు పైగా విక్రయాలు జరుగుతున్నాయి. ఆతర్వాత ఏలూరు సీ ఫుడ్‌ స్టాల్స్‌లో రోజుకు రూ.80 వేలు, అరకు కాఫీ స్టాల్‌లో రోజుకు రూ.75 వేలు చొప్పున అమ్మకాలు జరుగుతున్నాయి.

ఈ వార్తలనూ చదవండి..

కూటమి దూకుడు

పండుగపూట ఘోరం

Updated Date - Oct 22 , 2026 | 04:47 AM