ఇదో ‘ఫ్యాన్సీ’ విజయం
ABN , Publish Date - Nov 06 , 2026 | 06:37 AM
2552... 3113... 2442... ఎటువైపు నుంచి చదివినా ఒకేలా ఉండే పాలిండ్రోమ్ సంఖ్యలివి. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే..
విజయవాడ మునిసిపల్ ఎన్నికల్లో చిత్రాలు
(ఆంధ్రజ్యోతి - విజయవాడ): 2552... 3113... 2442... ఎటువైపు నుంచి చదివినా ఒకేలా ఉండే పాలిండ్రోమ్ సంఖ్యలివి. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే.. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇలాంటి ఫ్యాన్సీ ఓట్లు అభ్యర్థులు సాధించారు. విజయవాడలోని 86 డివిజన్లలో టీడీపీ 53, జనసేన 19, వైసీపీ 8, బీజేపీ 4, సీపీఎం, స్వతంత్ర అభ్యర్థి చెరో డివిజన్‌లో విజయం సాధించారు. ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అభ్యర్థులు నలుగురు పాలిండ్రోమ్ సంఖ్య కలిగిన ఓట్లు సాధించారు. 15వ డివిజన్‌లో జాస్తి సాంబశివరావుకు 2552 ఓట్లు, 17వ డివిజన్‌లో రాజేశ్ కోనేరుకు 3113 ఓట్లు, 61వ డివిజన్ నుంచి విజయం సాధించిన దామర్ల సరితకు 2442 ఓట్లు, 81వ డివిజన్ నుంచి పందిరి నాగమణికి 3663 ఓట్లు రావడం విశేషం.
ఇక ఎన్నికల్లో ఓడిపోయిన పది మంది అభ్యర్థులకు డబుల్ డిజిట్‌లో పాలిండ్రోమ్ ఫ్యాన్సీ ఓట్లు పోలయ్యాయి. 14వ డివిజన్‌లో దిమిలి సరోజని 55, 39వ డివిజన్‌లో తిరుపతి భార్గవి 11, 48వ డివిజన్‌లో బంకా ఝాన్సీలక్ష్మి 22, 54వ డివిజన్‌లో షరీఫ్ షేక్ 77, 70వ డివిజన్‌లో మందపాటి శ్రీకాంత్‌వర్మ 33, 72వ డివిజన్‌లో ఇతం మేఘన 66తోపాటు కురమదాసు పార్వతి 66, 79వ డివిజన్‌లో షేక్ హమీదున్నీసా 11, 80వ డివిజన్‌లో చారిష్మా అధికారి 11, 84వ డివిజన్‌లో వీర్ల నాగమణి 77 ఓట్లు సాధించారు. ఇక 54వ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గొల్ల మౌనికకు ఒక్క ఓటూ పడకపోవడం విశేషం.
ఈ వార్తలనూ చదవండి:
అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ