విజయవాడ లాడ్జిలో మహిళ దారుణ హత్య..
ABN , Publish Date - Nov 13 , 2026 | 04:16 PM
విజయవాడలో మహిళ హత్య కలకలం రేపింది. కృష్ణలంకలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ లాడ్జిలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మృతురాలిని పైడిశెట్టి ఎర్రమ్మగా పోలీసులు గుర్తించారు.
విజయవాడ, నవంబర్ 13: నగరంలో ఓ మహిళ హత్య తీవ్ర కలకలం రేపింది. కృష్ణలంకలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ లాడ్జిలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మృతురాలిని పైడిశెట్టి ఎర్రమ్మగా పోలీసులు గుర్తించారు. రెండు రోజులుగా భార్య కనిపించడం లేదంటూ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తాజాగా లాడ్జిలో ఆమె మృతదేహం బయటపడటం సంచలనంగా మారింది. ఓ యువకుడితో కలిసి లాడ్జికి వచ్చిన ఎర్రమ్మను అతడే హత్య చేసి.. గది తలుపులకు తాళం వేసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
తన భార్య రెండు రోజులుగా కనిపించడం లేదని ఎర్రమ్మ భర్త సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ లాడ్జిలో ఆమె మృతదేహం బయటపడటంతో పోలీసులు కేసును తీవ్రంగా పరిగణించారు. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించడంతో పాటు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా యువకుడి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహిళ మృతికి గల పూర్తి కారణాలు.. హత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి
మహారాష్ట్రలో రన్వే నుంచి పక్కకు దూసుకెళ్లిన విమానం..
ఇలాంటి దీపావళి చూస్తానని అనుకోలేదు.. యువతి ఆవేదన