విజయవాడలో కల్యాణి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. ఇద్దరి అరెస్ట్
ABN , Publish Date - Sep 26 , 2026 | 03:38 PM
విజయవాడలో సంచలనం సృష్టించిన కల్యాణి హత్య కేసును పోలీసులు ఛేదించారు. పోలీసుల దర్యాప్తులో మటన్ షాప్ యజమాని షఫీ ఈ హత్యకు పాల్పడినట్లు నిర్ధారణ అయినట్టు సమాచారం.
విజయవాడ, సెప్టెంబర్ 26: నగరంలో సంచలనం సృష్టించిన కల్యాణి హత్య కేసును పోలీసులు ఛేదించారు. పోలీసుల దర్యాప్తులో మటన్ షాప్ యజమాని షఫీ ఈ హత్యకు పాల్పడినట్లు నిర్ధారణ అయినట్టు సమాచారం. కొంతకాలంగా కల్యాణితో షఫీ సన్నిహితంగా ఉంటున్నాడని.. డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 17న కల్యాణిని భవానీపురంలోని తన ఇంటికి షఫీ తీసుకెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అక్కడ డబ్బుల విషయమై ఇద్దరి మధ్య గొడవ జరగడంతో, షఫీ కత్తితో కల్యాణి గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించినట్టు సమాచారం.
హత్య అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి, తన మటన్ షాపులో పనిచేసే గురువులు అనే వ్యక్తి సహాయంతో వాటిని తరలించినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం మృతదేహం భాగాలను విజయవాడలోని గొల్లపూడి ప్రాంతంలోని కూలింగ్ కెనాల్‌లో పడేసినట్లు దర్యాప్తులో తేలినట్టు పోలీసులు వెల్లడించారు. కేసులో షఫీతో పాటు అతడికి సహకరించిన గురువులను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు దారితీసిన పూర్తి కారణాలు, నిందితుల పాత్ర, మృతదేహాన్ని తరలించిన విధానం తదితర అంశాలపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
2027 గోదావరి పుష్కరాలే లక్ష్యంగా ‘ది గోదావరి కాల్స్’ ప్రచారం: మంత్రి దుర్గేష్
దుర్గగుడి ఘాట్‌రోడ్డుకు శాశ్వత రక్షణ చర్యలు.. దసరాకు సురక్షితంగా ఉండేలా ఆదేశాలు
Read Latest AP News And Telangana News And Telugu News