Share News

అభివృద్ధిని వదిలి ‘బటన్లు’ నొక్కితే అధికారం రాదు: విజయసాయిరెడ్డి

ABN , Publish Date - Nov 21 , 2026 | 06:56 AM

అభివృద్ధిని గాలికొదిలేసి బటన్లు నొక్కితే ప్రజలు అధికారం ఇస్తారనుకుంటే పొరపాటేనని పీఆర్‌పీ వ్యవస్థాపకుడు విజయసాయిరెడ్డి అన్నారు.

అభివృద్ధిని వదిలి ‘బటన్లు’ నొక్కితే అధికారం రాదు: విజయసాయిరెడ్డి

అమరావతి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): అభివృద్ధిని గాలికొదిలేసి బటన్లు నొక్కితే ప్రజలు అధికారం ఇస్తారనుకుంటే పొరపాటేనని పీఆర్‌పీ వ్యవస్థాపకుడు విజయసాయిరెడ్డి అన్నారు. శనివారం ఎక్స్‌లో.. ‘అభివృద్ధిని గాలికొదిలేసి, సంక్షేమ పథకాల బటన్లు నొక్కితే ప్రజలు అధికారం ఇస్తారనుకునే రోజులు పోయాయి. బటన్లు నొక్కితే కాదు.. ప్రజారంజకంగా పరిపాలన చేస్తేనే ప్రజలు అందలమెక్కిస్తారన్నది ఆ రెండు పార్టీలు ఇప్పటికైనా గుర్తెరగాలి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ గెలిచాం అంటే, ఆ గెలుపు తాత్కాలికమే!’ అని విజయసాయి పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

పంట నష్టంపై సాయం అందించండి.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌కు చంద్రబాబు వినతి

తాడిపత్రిలో హైటెన్షన్.. టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడి

Updated Date - Nov 21 , 2026 | 06:57 AM