11వ నెల... 11వ తేదీ... 11.11 గంటలకు
ABN , Publish Date - Oct 22 , 2026 | 04:56 AM
పదకొండవ నెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు కొత్త పార్టీ ప్రకటన చేయనున్నట్లు వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వి.విజయ సాయిరెడ్డి తెలిపారు.
కొత్త పార్టీ ప్రకటన చేస్తున్నా: విజయ సాయిరెడ్డి
అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): పదకొండవ నెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు కొత్త పార్టీ ప్రకటన చేయనున్నట్లు వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వి.విజయ సాయిరెడ్డి తెలిపారు. కొన్నాళ్లుగా దసరా రోజున కొత్త పార్టీ పెడుతున్నట్లు విజయసాయి చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే.
ఆ క్రమంలోనే కొత్త పార్టీ ప్రకటించే తేదీని దసరా రోజున ఆయన వెల్లడించారు. విజయవాడలో 11న కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు ఆహ్వాన పత్రికలో విజయసాయి పేర్కొన్నారు. పార్టీని ప్రకటించిన నాడే తన సిద్ధాంతాలను.. రాజకీయ కార్యచరణను ప్రకటిస్తానన్నారు. కాగా, 11వ అంకెను పదేపదే ప్రస్తావించడం... తన మాజీ రాజకీయ బాస్ జగన్‌ను హేళన చేసేందుకేనని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది.
ఈ వార్తలనూ చదవండి..