మీ పత్రికలో తప్పుడు కథనం
ABN , Publish Date - Sep 22 , 2026 | 04:22 AM
జీవో నంబర్ 52పై సాక్షిలో తప్పుడు కథనాలు రాశారని వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ అభ్యర్థులు నిరసన తెలిపారు. సోమవారం తాడేపల్లిలోని జగన్ నివాసం ముందు నిరసనకు దిగారు. సాక్షి పత్రికలో వచ్చిన కథనాన్ని మాజీ సీఎం జగన్ ఖండించాలని డిమాండ్ చేశారు.
జగన్ ఇంటి వద్ద వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ అభ్యర్థుల నిరసన
జీవో నంబర్ 52పై తప్పుడు రాతలు
వీఏఎస్ పోస్టుల భర్తీపై ప్రభావం
జగన్ ఖండించాలని డిమాండ్
జగన్ ఇంటి వద్ద వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ అభ్యర్థుల నిరసన
తాడేపల్లి టౌన్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): జీవో నంబర్ 52పై సాక్షిలో తప్పుడు కథనాలు రాశారని వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ అభ్యర్థులు నిరసన తెలిపారు. సోమవారం తాడేపల్లిలోని జగన్ నివాసం ముందు నిరసనకు దిగారు. సాక్షి పత్రికలో వచ్చిన కథనాన్ని మాజీ సీఎం జగన్ ఖండించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు జీవో 52 ప్రకారం వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ నియామకాలను డిపార్ట్‌మెంటల్ సెలక్షన్ కమిటీ ద్వారా చేపట్టాలని కోరుతూ విజయవాడలోని పశుసంవర్థక శాఖ అడిషనల్ డైరెక్టర్ (ఇన్‌చార్జి డైరెక్టర్) రజిని కార్యాలయం వద్దకు 80 మంది అభ్యర్థులు వెళ్లారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ.. సాక్షి పత్రికలో జీవో 52ను తప్పుపడుతూ కథనాలు వచ్చాయన్నారు. ప్రభుత్వం ఆ జీవో ద్వారా వీఏఎస్ పోస్టులను అమ్ముకుంటుందని కథనాలు రాయడంతో అధికారులు ప్రభావితమయ్యారని అన్నారు. దీంతో అధికారులు జీవో నంబర్ 52ను రద్దు చేసి నియామకాలను ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టేందుకు సిద్ధమవుతున్నారని, ఇదే జరిగితే ఇప్పటి వరకు సర్వీసు చేసిన తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ వెటర్నరీ స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎస్.బెన్నీ జాకబ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
ఈ వార్తలనూ చదవండి....
‘హామీల అమలుకు చర్యలు తీసుకోండి’
ఆర్‌వీ నగర్ కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్సవాలకు సీఎం రాక