Share News

కొడాలి నాని.. పిచ్చి ప్రేలాపనలకే పరిమితం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

ABN , Publish Date - Sep 13 , 2026 | 05:51 PM

మంత్రి నారా లోకేశ్‌పై గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తీవ్రంగా ఖండించారు. ఓడిపోయిన వ్యక్తి.. స్థాయి గురించి మాట్లాడటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.

కొడాలి నాని.. పిచ్చి ప్రేలాపనలకే పరిమితం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
Venigandla Ramu vs Kodali Nani

కృష్ణా, సెప్టెంబర్ 13: మంత్రి నారా లోకేశ్‌పై గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తీవ్రంగా ఖండించారు. గుడివాడ ప్రజా వేదిక కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. కొడాలి నాని పిచ్చి ప్రేలాపనలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఓడిపోయిన వ్యక్తి.. స్థాయి గురించి మాట్లాడటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో జరిగిన డీఎస్సీపై చర్చకు రావాలని లోకేశ్ స్వయంగా ప్రకటించారని, ఆయన తన స్థాయిని తగ్గించుకుని చర్చకు సిద్ధమైనా వైసీపీ నేతలు పిచ్చివాగుడు వాగుతున్నారని విమర్శించారు. సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ స్థాయిలను దాటి ఇప్పుడు ట్రంప్ వరకూ వెళ్లిపోయారని, గుడివాడ మాజీ ఎమ్మెల్యే మాటలను బయటివారు నమ్మొచ్చేమో కానీ గుడివాడ ప్రజలు మాత్రం నమ్మరని అన్నారు.


స్థానిక ఎన్నికలంటే భయమేమీ లేదని చెప్పుకునే కొడాలి నాని.. గుడివాడలో మున్సిపల్ ఎన్నికలు జరగకుండా కోర్టును ఆశ్రయించడమేంటని రాము ప్రశ్నించారు. కొత్తతరం నాయకులు వస్తారన్న భయంతోనే ప్రతిసారీ ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ, గుడివాడ మాజీ ఎమ్మెల్యే విధానం ఎన్నికలను ఆపేందుకు కోర్టులకు వెళ్లడమేనని విమర్శించారు. డీఎస్సీ విషయంలో మూడు సార్లు కోర్టులు కొట్టివేసినా వైసీపీ అబద్ధాల ప్రచారం ఆపడం లేదన్నారు. ఎన్నికల ప్రాధాన్యత తెలిసిన చంద్రబాబు.. తాను ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారీ స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు చొరవ చూపారని తెలిపారు. గుడివాడలో వంద శాతం ఎన్నికలు జరుగుతాయని, వాటిని ఎవరూ అడ్డుకోలేరని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మాపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దు: కొండా సురేఖ

విదేశీ యువతులతో వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టురట్టు..

For More AP News And Telugu News

Updated Date - Sep 13 , 2026 | 06:13 PM