Share News

ట్రిపుల్‌ ఇంజన్‌ సర్కారుతోనే అభివృద్ధి

ABN , Publish Date - Oct 31 , 2026 | 01:38 AM

ట్రిపుల్‌ ఇంజన్‌ సర్కారుతోనే దేశాభివృద్ధి సాధ్యమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి తోఖన్‌ సాహూ అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగం గా శుక్రవారం ఆయన అనంతపురం జిల్లా కేంద్రానికి వచ్చారు.

ట్రిపుల్‌ ఇంజన్‌ సర్కారుతోనే అభివృద్ధి

  • అనంతపురంలో కూటమి భారీ ర్యాలీ

అనంతపురం క్లాక్‌టవర్‌, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): ట్రిపుల్‌ ఇంజన్‌ సర్కారుతోనే దేశాభివృద్ధి సాధ్యమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి తోఖన్‌ సాహూ అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగం గా శుక్రవారం ఆయన అనంతపురం జిల్లా కేంద్రానికి వచ్చారు. రాష్ట్ర మంత్రి సత్యకుమార్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌, సినీనటుడు బాబూమోహన్‌, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌తో కలసి కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. మంత్రి తోఖన్‌ సాహూ మాట్లాడుతూ, ‘కూటమి తరఫున అనంతపురం నగర మేయర్‌ అభ్యర్థిగా బరిలో దిగిన అజేశ్‌ యాదవ్‌ను ఆశీర్వదించడానికి నేను స్వయంగా ఢిల్లీ నుంచి వచ్చా. అజేశ్‌ యాదవ్‌ నగర ప్రజలకు ఇస్తున్న ప్రతి హామీనీ నెరవేర్చే పూర్తి బాధ్యతను ప్రధానమంత్రి ప్రతినిధిగా నేను తీసుకుంటున్నా. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ నేతృత్వంలోని ట్రిపుల్‌ ఇంజన్‌ సర్కారుకు మద్దతివ్వండి. అనంతపురం నగరంలో అండర్‌ డ్రైనేజీ డీపీఆర్‌ను ఇప్పటికే కేంద్రం పరిశీలించింది. త్వరలో మంజూరు చేసి ప్రజలకు శుభవార్త చెబుతాం ’ అని మంత్రి అన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

శబరిమలై రైళ్లు ఫుల్‌

ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?

Updated Date - Oct 31 , 2026 | 01:38 AM