Share News

చరిత్ర.. వర్తమానంలో ఆంధ్రులది ప్రత్యేక స్థానం

ABN , Publish Date - Oct 09 , 2026 | 04:51 AM

భారత్‌ అభివృద్ధి ప్రస్థానంలో ఆంధ్రప్రదేశ్‌ పాత్ర అత్యంత కీలకమని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌ అన్నారు. అప్పట్లోనే ఆంధ్ర ప్రాంతం నౌకా వాణిజ్యం ద్వారా ప్రపంచంతో వాణిజ్య సంబంధాలు కొనసాగించిందని తెలిపారు.

చరిత్ర.. వర్తమానంలో ఆంధ్రులది ప్రత్యేక స్థానం

  • 1998లోనే చంద్రబాబు టెక్నాలజీ అందిపుచ్చుకున్నారు

  • సన్‌రైజ్‌ స్టేట్‌గా ఏపీ అభివృద్ధికి మోదీ సహకారం

  • విశాఖ సదస్సుకు హాజరుకండి

  • పారిశ్రామికవేత్తలకు కేంద్ర మంత్రి గోయెల్‌ పిలుపు

భారత్‌ అభివృద్ధి ప్రస్థానంలో ఆంధ్రప్రదేశ్‌ పాత్ర అత్యంత కీలకమని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌ అన్నారు. అప్పట్లోనే ఆంధ్ర ప్రాంతం నౌకా వాణిజ్యం ద్వారా ప్రపంచంతో వాణిజ్య సంబంధాలు కొనసాగించిందని తెలిపారు. అమరావతిని పాలించిన శాతవాహనులు వినియోగించిన నాణేల్లో నౌకా చిహ్నం ఉండేదని గుర్తుచేశారు. ఆ నౌక చిహ్నం భారతీయుల వాణిజ్యం, విశ్వాసం, ఆలోచనలకు ప్రతీకగా నిలిచిందన్నారు.

ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ అంటే వాణిజ్యవేత్తలు, పారిశ్రామికవేత్తలకు చిరునామాగా ఉందని అన్నారు. దార్శనిక నేత చంద్రబాబు 1998లోనే టెక్నాలజీని అందిపుచ్చుకుని రాష్ట్రంలో విస్తృత అవకాశాలు సృష్టించారని ప్రశంసించారు. సన్‌రైజ్‌ స్టేట్‌గా ఏపీ అభివృద్ధికి ప్రధాని మోదీ, కేంద్రప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తున్నాయని చెప్పారు. విశాఖలో గూగుల్‌ డేటా సెంటర్‌తో పాటు అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్‌ వ్యాలీ ఏర్పాటు అవుతోందని తెలిపారు. కేంద్రం, రాష్ట్రాలు టీమ్‌ ఇండియాగా దేశాభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుకు పారిశ్రామికవేత్తలు హాజరై రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలను పరిశీలించాలని పిలుపునిచ్చారు.

ఈ వార్తలనూ చదవండి:

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన కీలక అంశాలివే..

డిజిటల్ కరెన్సీని మోదీ ప్రోత్సహించారు

Updated Date - Oct 09 , 2026 | 04:51 AM