Share News

ఏపీకి అండగా ఉంటాం: అమిత్‌ షా

ABN , Publish Date - Nov 04 , 2026 | 04:55 AM

మురసు తుఫాన్‌ నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మంగళవారం ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో తుఫాను ప్రభావం, సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఏపీకి అండగా ఉంటాం: అమిత్‌ షా

  • సీఎం చంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి ఫోన్‌

అమరావతి/న్యూఢిల్లీ, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): మురసు తుఫాన్‌ నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మంగళవారం ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో తుఫాను ప్రభావం, సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అర్నబ్‌, ఆ వెంటనే మురసు తుఫాను రావడంతో ఏర్పడిన పరిస్థితులను చంద్రబాబు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వివిధ జిల్లాల్లో పంట, ఆస్తి నష్టం, ప్రభుత్వం తీసుకుంటున్న సహాయ చర్యలను వివరించారు. అర్నబ్‌ నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందాన్ని పంపినందుకు ధన్యవాదాలు తెలిపారు. వరుస తుఫాన్ల నేపథ్యంలో తగు సాయం చేసి ఆదుకోవాలని కోరారు. కాగా, తుఫాను బాధితులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఏపీ ప్రజలకు కేంద్రం అండగా నిలుస్తుందని అమిత్‌ షా హామీ ఇచ్చారు.

ఈ వార్తలనూ చదవండి:

కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం

కూటమికే.. పట్టణం

Updated Date - Nov 04 , 2026 | 04:55 AM