Share News

ఏడవకేడవకు నాన్నా..

ABN , Publish Date - Oct 25 , 2026 | 05:48 AM

నెల్లూరు జిల్లా దుత్తలూరు ఎమ్పీడీవో కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన జరుగుతుండగా ఓ దృశ్యం అందర్నీ ఆకర్షించింది. మండలంలోని కొత్తపేట ఎమ్పీటీసీ స్థానానికి టి.సుజాత నామినేషన్‌ వేశారు. శనివారం నామినేషన్‌ పత్రాల పరిశీలన సందర్భంగా భర్త మోహన్‌రావుతో కలిసి సుజాత ఎమ్పీడీవో కార్యాలయం లోపలకు వెళ్లారు.

ఏడవకేడవకు నాన్నా..

  • అమ్మానాన్న ఆఫీసులో ఉన్నారు కన్నా!

దుత్తలూరు, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా దుత్తలూరు ఎమ్పీడీవో కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన జరుగుతుండగా ఓ దృశ్యం అందర్నీ ఆకర్షించింది. మండలంలోని కొత్తపేట ఎమ్పీటీసీ స్థానానికి టి.సుజాత నామినేషన్‌ వేశారు. శనివారం నామినేషన్‌ పత్రాల పరిశీలన సందర్భంగా భర్త మోహన్‌రావుతో కలిసి సుజాత ఎమ్పీడీవో కార్యాలయం లోపలకు వెళ్లారు. తమ ఆర్నెల్ల కుమార్తెను ఆఫీసు బయట వేచిఉన్న మరిది (భర్త తమ్ముడు)కి అప్పగించారు. 2, 3 గంటలకు గడిచిపోవడంతో ఆ చిన్నారి ఆకలితో ఏడవడం మొదలుపెట్టింది. దీంతో దిక్కుతోచని ఆ యువకుడు పోలీసులను బతిమిలాడి ఆ చిన్నారిని తల్లి వద్దకు తీసుకెళ్లాడు. ఎన్నికల సందడి మధ్య చిన్నారి ఆకలి తీర్చేందుకు బాబాయి పడిన తపన అక్కడున్న వారి ప్రశంసలు అందుకుంది.

ఈ వార్తలనూ చదవండి:

కానరాని ఎన్నికల సందడి

భీతావహం

Updated Date - Oct 25 , 2026 | 05:48 AM