Share News

చెరువు బురదలో చిక్కుకుని ఇద్దరు విద్యార్థులు మృతి

ABN , Publish Date - Oct 01 , 2026 | 04:33 AM

వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసే క్రమంలో ఇద్దరు విద్యార్థులు బురదలో చిక్కుకుని మృతిచెందారు. చిత్తూరు మంగసముద్రానికి చెందిన పిల్లలంతా కలిసి దొంగలబావి వీధిలో సోమవారం చిన్నపాటి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

చెరువు బురదలో చిక్కుకుని ఇద్దరు విద్యార్థులు మృతి

  • వినాయక నిమజ్జనంలో అపశ్రుతి

చిత్తూరు అర్బన్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసే క్రమంలో ఇద్దరు విద్యార్థులు బురదలో చిక్కుకుని మృతిచెందారు. చిత్తూరు మంగసముద్రానికి చెందిన పిల్లలంతా కలిసి దొంగలబావి వీధిలో సోమవారం చిన్నపాటి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు పూజలు చేశారు. బుధవారం సాయంత్రం పాఠశాల నుంచి ఇళ్లకు వచ్చాక నిమజ్జనం కోసం విగ్రహాన్ని తీసుకుని చెరువుకు వెళ్లారు. కాలనీ నుంచి చెరువు దూరంగా ఉండటంతో అక్కడికి వెళ్లేసరికి బాలాజీ(13), హరి(13)తో పాటు మరొకరే మిగిలారు. విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి బాలాజీ, హరి చెరువులో దిగి బురదలో చిక్కుకున్నారు.

బయటికి రావడానికి ప్రయత్నించే క్రమంలో మరింత కూరుకుపోయారు. గట్టుపైన ఉన్న మరో విద్యార్థి పరుగెత్తుకుంటూ వెళ్లి స్థానికులకు చెప్పారు. వాళ్లొచ్చే సరికే బాలాజీ మృతిచెందగా, కొన ఊపిరితో ఉన్న హరిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణించాడు. చనిపోయిన ఇద్దరూ సంతపేట పీఎన్‌సీ మున్సిపల్‌ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్నారు.

ఈ వార్తలనూ చదవండి...

ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’

రైతులకు తీపి కబురు

Updated Date - Oct 01 , 2026 | 04:33 AM