Share News

రాష్ట్రంలో పెట్టుబడులకు రెండు సంస్థల ఆసక్తి

ABN , Publish Date - Sep 04 , 2026 | 05:41 AM

రాష్ట్రంలో లాజిస్టిక్స్‌, ఏవియేషన్‌ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు రెండు సంస్థలు ఆసక్తి చూపాయి. రూ. 300 కోట్ల పెట్టుబడులతో శ్రీక్షేత్ర లాజిస్టిక్స్‌ ప్రతిపాదనలు అందించగా, భోగాపురం, కర్నూలు, విజయవాడ విమానాశ్రయాల్లో మెయింటనెన్స్‌, రిపేర్‌, ఓవర్‌హాల్‌ (ఎమ్మార్వో) ఏర్పాటు చేస్తామని మెల్‌స్టార్‌ పేర్కొంది.

రాష్ట్రంలో పెట్టుబడులకు రెండు సంస్థల ఆసక్తి

  • లాజిస్టిక్స్‌, ఏవియేషన్‌లో ప్రతిపాదనలు

  • 300 కోట్ల పెట్టుబడికి శ్రీక్షేత్ర లాజిస్టిక్స్‌ సిద్ధం

  • 3 ఎయిర్‌పోర్టుల్లో ఎమ్మార్వో .. మెల్‌స్టార్‌

  • పెట్టుబడిదారులకు పూర్తి సహకారం: మంత్రి బీసీ జనార్దనరెడ్డి

అమరావతి, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో లాజిస్టిక్స్‌, ఏవియేషన్‌ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు రెండు సంస్థలు ఆసక్తి చూపాయి. రూ. 300 కోట్ల పెట్టుబడులతో శ్రీక్షేత్ర లాజిస్టిక్స్‌ ప్రతిపాదనలు అందించగా, భోగాపురం, కర్నూలు, విజయవాడ విమానాశ్రయాల్లో మెయింటనెన్స్‌, రిపేర్‌, ఓవర్‌హాల్‌ (ఎమ్మార్వో) ఏర్పాటు చేస్తామని మెల్‌స్టార్‌ పేర్కొంది. ఈ మేరకు గురువారం సచివాలయంలో మౌలిక సదుపాయాల కల్పనా శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డికి వారి ప్రతిపాదనలు అందించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని శ్రీక్షేత్ర, మెల్‌స్టార్‌లకు భరోసా ఇచ్చారు. లాజిస్టిక్స్‌ రంగంలో దాదాపు 30 ఏళ్ల అనుభవం కలిగిన శీక్షేత్రకు.. రూ. 1500 కోట్ల టర్నోవర్‌ ఉంది. రాష్ట్రంలో పోర్టులు, రైల్వే కనెక్టివిటి, మల్టీమోడల్‌ లాజిస్టిక్స్‌ హబ్‌ల అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి ఆ సంస్థ ఆసక్తి చూపింది. ఏపీలో ఏవియేషన్‌ రంగానికి భారీ అవకాశాలు ఉన్నందున తాము పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని మెల్‌స్టార్‌ సంస్థ పేర్కొంది. కర్నూలు విమానాశ్రయంలో ఏర్పాటు చేస్తున్న మెల్‌స్టార్‌ ఏవియేషన్‌ లెర్నింగ్‌ అకాడమీలో పైలట్‌ శిక్షణ కేంద్రం పురోగతిని సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. మూడు విమానాశ్రయాల్లో ఎమ్మార్వో ఏర్పాటు చేస్తామని మెల్‌స్టార్‌ పేర్కొంది. పూర్తిస్థాయి ప్రతిపాదనలతో వస్తే పరిశీలించి ఆమోదం తెలుపుతామని మంత్రి హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

తిలక్‌ అదిరెన్‌!

కేరళ సీఎంతో రొనాల్డ్ సోదరి భేటీ.. వీడియో వైరల్


Updated Date - Sep 04 , 2026 | 05:41 AM