ఎన్నికల కోడ్ ముగిసే వరకు సిఫారసు దర్శనాలకు బ్రేక్
ABN , Publish Date - Oct 22 , 2026 | 04:17 AM
తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉన్నందున శ్రీవారి దర్శనం, వసతి కోసం తిరుమలలో ఎలాంటి సిఫారసు లేఖలు తీసుకోబోమని టీటీడీ మంగళవారం స్పష్టం చేసింది.
తిరుమల, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉన్నందున శ్రీవారి దర్శనం, వసతి కోసం తిరుమలలో ఎలాంటి సిఫారసు లేఖలు తీసుకోబోమని టీటీడీ మంగళవారం స్పష్టం చేసింది. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు మాత్రమే దర్శనం, వసతి కల్పిస్తామని పేర్కొంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉన్నంత వరకు ఈ నిర్ణయం వర్తిస్తుందని, భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
ఈ వార్తలనూ చదవండి..