Share News

వర్షం వచ్చినా భక్తులు తడవకుండా..

ABN , Publish Date - Oct 23 , 2026 | 05:40 AM

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఈసారి వర్షాల కారణంగా గ్యాలరీల్లో ఉన్న భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారి గ్యాలరీ నుంచి బయటకు వెళితే వాహనంపై విహరించే మలయప్పస్వామిని వీక్షించలేమన్న భావనతో అక్కడే కదలకుండా ఉన్నారు.

వర్షం వచ్చినా భక్తులు తడవకుండా..

  • ఏర్పాట్లు చేయడానికి టీటీడీ యోచన

  • పరీశీలనలో పెద్దపెద్ద గొడుగులు, షెడ్లు

తిరుపతి(టీటీడీ), అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఈసారి వర్షాల కారణంగా గ్యాలరీల్లో ఉన్న భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారి గ్యాలరీ నుంచి బయటకు వెళితే వాహనంపై విహరించే మలయప్పస్వామిని వీక్షించలేమన్న భావనతో అక్కడే కదలకుండా ఉన్నారు. గరుడ వాహనసేవ రోజు టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి గ్యాలరీల్లోని భక్తుల వద్దకు వెళ్లి టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు.

ఈ సమయంలోనే వర్షం కారణంగా భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించారు. భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో పెద్దపెద్ద గొడుగులు, మిరిపిరి, సహా వివిధ రకాల షెడ్ల ఏర్పాటు విషయమై అధికారులు యోచిస్తున్నారు. సమగ్ర అధ్యయనం తర్వాత టీటీడీ ఉన్నతాధికారులు దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

సమన్వయంతో పనిచేయండి

అప్పుల ఊబిలో యువత

Updated Date - Oct 23 , 2026 | 05:41 AM