నేడు టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ బాధ్యతల స్వీకరణ
ABN , Publish Date - Nov 06 , 2026 | 06:05 AM
టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్‌గా ఈవో ముద్దాడ రవిచంద్ర శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బీఆర్ నాయుడు చైర్మన్‌గా టీటీడీ బోర్డును ఏర్పాటు చేయగా ..
తిరుమల, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్‌గా ఈవో ముద్దాడ రవిచంద్ర శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బీఆర్ నాయుడు చైర్మన్‌గా టీటీడీ బోర్డును ఏర్పాటు చేయగా ఆ బోర్డు పదవి కాలం గత నెల 31వ తేదీన పూర్తయింది. ఈక్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నూతన బోర్డును ఏర్పాటు చేసే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి టీటీడీ ఈవోను చైర్మన్‌గా, ఆర్థిక శాఖ కార్యదర్శి వినయ్‌చంద్, రెవెన్యూ శాఖ (దేవదాయ) కార్యదర్శి కన్నబాబును సభ్యులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ వార్తలనూ చదవండి:
అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ