Share News

ఆన్‌లైన్‌లో టీటీడీ 2027 క్యాలెండర్లు, డైరీలు

ABN , Publish Date - Nov 10 , 2026 | 01:13 AM

2027వ సంవత్సర క్యాలెండర్లు, డైరీలను భక్తులు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చని టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఆన్‌లైన్‌లో టీటీడీ 2027 క్యాలెండర్లు, డైరీలు

తిరుపతి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): 2027వ సంవత్సర క్యాలెండర్లు, డైరీలను భక్తులు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చని టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ https://ttdevasanthanams.ap.gov.in ద్వారా వీటిని పొందవచ్చని తెలిపింది. తిరుపతి, తిరుమల, తిరుచానూరులోని టీటీడీ ప్రచురణల విక్రయ విభాగానికి చెందిన 12 విక్రయ కేంద్రాల్లోనూ అందుబాటులో ఉన్నాయని, హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌, హిమాయత్‌నగర్‌తో పాటు విజయవాడ, చెన్నై, వేలూరు, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై నగరాల్లోని టీటీడీ సమాచార కేంద్రాల్లో కూడా విక్రయిస్తున్నట్టు వెల్లడించింది.

ఈ వార్తలనూ చదవండి:

పల్లెపోరుకు వేళాయె!

ఆ ఒక్కచోట ఎందుకిలా?

Updated Date - Nov 10 , 2026 | 01:16 AM