ఘోర విషాదం.. ఇద్దరు కుమార్తెలతో కలిసి తల్లి ఆత్మహత్య
ABN , Publish Date - Feb 07 , 2026 | 09:06 PM
తిరుపతి జిల్లా పుత్తూరులో శనివారం అత్యంత విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..
తిరుపతి: పుత్తూరు(Puttur town)లో తీవ్ర విషాదం నెలకొంది. ఓ తల్లి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి బలవన్మరణానికి పాల్పడటం అందరినీ కలచివేసింది. స్థానికంగా నివాసం ఉంటున్న శివ, పద్మ దంపతులకు తేజశ్రీ (7), లాస్య (5) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శ్రీసిటీ ప్రాంతంలో పద్మ భర్త శివ ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. శనివారం పద్మ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఈ విషయం తెలిసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబకలహాలు లేదా ఆర్థిక ఇబ్బందులే ఈ దారుణానికి కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
ఈ వార్తలూ చదవండి:
బీఎంసీ మేయర్ ఎన్నిక.. బీజేపీ అభ్యర్థిగా రితూ తావ్డే
ఓటుకు రూ.2వేలు పంచేందుకు సిద్ధమైన డీఎంకే.. బీజేజీ ఆరోపణ