Share News

తిరుపతిలో 12 ఏళ్ల బాలుడిని రక్షించిన పోలీసులు.. ఏం జరిగిందంటే!

ABN , Publish Date - Aug 30 , 2026 | 08:54 AM

ఇంటి నుంచి వెళ్లిపోయిన 12 ఏళ్ల బాలుడి కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్న వేళ.. తిరుపతి ఈస్ట్ పోలీసులు వెంటనే స్పందించి బాలుడిని సురక్షితంగా గుర్తించారు. వివరాల్లోకి వెళితే..

తిరుపతిలో 12 ఏళ్ల బాలుడిని రక్షించిన పోలీసులు.. ఏం జరిగిందంటే!
Tirupati Police

తిరుపతి, ఆగస్టు 30: నగరంలో ఇంటి నుంచి వెళ్లిపోయిన 12 ఏళ్ల బాలుడిని ఈస్ట్ పోలీసులు సురక్షితంగా గుర్తించి రక్షించారు. మార్కాపురానికి చెందిన వెంకటనారాయణ కుమారుడు కిషోర్‌ ఇంటి నుంచి వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు రంగంలోకి దిగి, అతడితో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ క్రమంలో బాలుడు తెలిపిన ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు అతడి తల్లిదండ్రులను సంప్రదించి సమాచారం అందించారు.


అనంతరం కిషోర్‌ను సురక్షితంగా పోలీసుల వద్దకు తీసుకువచ్చి, తల్లిదండ్రులకు అప్పగించే ముందు తండ్రీకొడుకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. బాలుడు ఇంటి నుంచి వెళ్లిపోవడానికి దారితీసిన పరిస్థితులపై ఆరా తీసిన పోలీసులు.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తల్లిదండ్రులు, బాలుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనంతరం కిషోర్‌ను తండ్రి వెంకటనారాయణకు అప్పగించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లిన పోలీస్.. మండిపడుతున్న నెటిజన్లు..

ఈ బస్సు క్లీనర్ నిజంగా దేవుడే.. వృద్ధుడిని ఎలా కాపాడాడో చూడండి..

Updated Date - Aug 30 , 2026 | 12:52 PM