Share News

వైసీపీ దుష్ప్రచార పర్వం!

ABN , Publish Date - Nov 24 , 2026 | 03:45 AM

తిరుపతి జిల్లా రేణిగుంట-కడప జాతీయ రహదారి విస్తరణలో భాగంగా అధికారులు రేణిగుంట మండలం ఆంజనేయపురం సమీపంలోని ఓ చిన్నపాటి ఆంజనేయస్వామి ఆలయాన్ని సోమవారం తొలగించారు. అయితే దీనిపై వెంటనే రంగ ప్రవేశం చేసిన వైసీపీ నేతలు..

వైసీపీ దుష్ప్రచార పర్వం!

  • కడప-రేణిగుంట రోడ్డు విస్తరణకు ఆలయం కూల్చివేత

  • వెంటనే రంగంలోకి దిగిన జగన్‌ సహా ఆ పార్టీ నేతలు

  • ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం

  • వాస్తవాలతో తిప్పికొట్టిన అధికారులు

తిరుపతి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా రేణిగుంట-కడప జాతీయ రహదారి విస్తరణలో భాగంగా అధికారులు రేణిగుంట మండలం ఆంజనేయపురం సమీపంలోని ఓ చిన్నపాటి ఆంజనేయస్వామి ఆలయాన్ని సోమవారం తొలగించారు. అయితే దీనిపై వెంటనే రంగ ప్రవేశం చేసిన వైసీపీ నేతలు.. ఆలయం తొలగింపు వెనుక ఏం జరిగిందన్న విషయంపై ‘ముందూ వెనకా..’ చూసుకోకుండా కూటమి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారు. ఈ ఆలయం పల్లవుల కాలం నాటిదంటూ తమదైన శైలిలో తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆలయం వద్దకు వెళ్లిన వీడియోలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసి, కూటమి ప్రభుత్వంపై ఆరోపణలతో దుష్ప్రచారానికి తెరలేపారు.

వైసీపీ అధ్యక్షుడు జగన్‌ కూడా దీనిపై తన ‘ఎక్స్‌’ ఖాతాలో స్పందిస్తూ ‘హే రామ్‌.. సేవ్‌ టెంపుల్స్‌’ అంటూ గగ్గోలు పెట్టారు. ‘శతాబ్దాల’ నాటి ఆలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారని చెబుతూ.. ఇది కోట్లాది మంది భక్తుల విశ్వాసాలపై దాడి అని అన్నారు. అయితే అసలు వాస్తవాలను తెలియజేస్తూ దేవదాయ శాఖ వైసీపీ తప్పుడు ప్రచారానికి చెక్‌ పెట్టింది. ఆలయంలోని మూల విరాట్టు స్వయంభువు కాదని, ఈ ఆలయం పల్లవుల కాలం నాటిది కూడా కాదని, అక్కడి గ్రామస్తులు సుమారు 70 ఏళ్ల కిందట నిర్మించుకున్నారని స్పష్టం చేసింది. అసలు ఈ రోడ్డు విస్తరణ పని మంజూరైంది గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనేనని, ఆలయ భూమిని రోడ్డు విస్తరణకు సేకరించాలని అవార్డు పాస్‌ చేసింది కూడా అప్పుడేనని ఓ ప్రకటనలో వెల్లడించారు. 2023 అక్టోబరు 20నే ఆలయ భూమికి పరిహారంగా రూ.59.30 లక్షల మొత్తాన్ని ఆలయ ఈవో ఖాతాలో డిపాజిట్‌ కూడా చేసినట్లు పేర్కొన్నారు.


గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత, వారందరినీ ఒప్పించాకే ఆలయాన్ని తొలగించాలని నిర్ణయించారని, రోడ్డు విస్తరణకు సేకరించిన స్థలం పోనూ ఇంకా ఆలయానికి మిగిలి ఉన్న 50 సెంట్ల స్థలంలో నూతన ఆలయం నిర్మించేలా నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ ఆలయం దేవాదాయ శాఖ 6 (సి) కేటగిరీలో ఈ ఆలయం ఉంది. తిరుపతి గ్రూప్‌ టెంపుల్స్‌ ఈవో ఆధ్వర్యంలో నడుస్తోంది. రేణిగుంట-కడప జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరిస్తున్న క్రమంలో ఈ ఆలయ కట్టడాలను తొలగించాల్సిన అవసరం ఏర్పడింది. ఆలయానికి చెందిన 1740 చదరపు మీటర్ల స్థలాన్ని నేషనల్‌ హైవేస్‌ అథారిటీ సేకరించింది. అయితే వాస్తవాలు ఇలా ఉండగా ఆలయాన్ని సందర్శించిన భూమన కరుణాకర రెడ్డి ఈ వివరాలన్నింటినీ దాచిపెట్టి కూటమి ప్రభుత్వంపై ఆరోపణలకు దిగడం గమనార్హం.

శాస్త్రోక్తంగా పునఃప్రతిష్ట

రెండు రోజుల కిందటే ఆలయంలోని మూల విరాట్టు విగ్రహాన్ని, ముఖ్యమైన దేవతా ప్రతిమలను శాస్త్రోక్తంగా అత్యంత సురక్షితంగా అక్కడి నుంచి మరో చోటుకు తరలించారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకే ఆలయ కట్టడాలను తొలగించామని అధికారులు పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

చేతులెలా వచ్చాయ్‌!

నామినీ ఉంటేనే బీమా

Updated Date - Nov 24 , 2026 | 03:49 AM