శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
ABN , Publish Date - Nov 10 , 2026 | 01:02 AM
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉదయం దీపావళి ఆస్థానం వైభవంగా జరిగింది. మలయప్పస్వామి, శ్రీదేవి, భూదేవి, విష్వక్సేనుల ఉత్సవమూర్తులను ఆలయంలోని బంగారు వాకిలి వద్ద గరుడాళ్వార్ సన్నిధిలో వేంచేపు చేసి ఆస్థానాన్ని నిర్వహించారు.
తిరుమల, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉదయం దీపావళి ఆస్థానం వైభవంగా జరిగింది. మలయప్పస్వామి, శ్రీదేవి, భూదేవి, విష్వక్సేనుల ఉత్సవమూర్తులను ఆలయంలోని బంగారు వాకిలి వద్ద గరుడాళ్వార్ సన్నిధిలో వేంచేపు చేసి ఆస్థానాన్ని నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలను శాస్ర్తోక్తంగా నిర్వహించారు. తర్వాత కర్పూర మంగళహారతులు, ప్రసాద నివేదనలు సమర్పించారు. అనంతరం మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన పట్టువస్ర్తాలను సమర్పించి రూపాయి హారతి, ప్రత్యేక హారతులు నిర్వహించడంతో దీపావళి ఆస్థానం ముగిసింది.
ఈ వార్తలనూ చదవండి: