తిరుమలలో జోరు వాన
ABN , Publish Date - Sep 22 , 2026 | 04:57 AM
తిరుమలలో వర్షం దంచికొట్టింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం సూర్యప్రభ వాహన సేవ జరిగినంత సేపూ ఎండ తీవ్రత ఉన్నా.. ఆ తర్వాత దట్టమైన నల్లటి మేఘాలు తిరుమలను కప్పేశాయి. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2.30 గంటల వరకు జోరు వర్షం కురిసింది.
ఘటాటోపం నీడలో చంద్రప్రభ వాహన సేవ
వర్షంలోనే తడుస్తూ వీక్షించిన భక్తులు
తిరుమల, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): తిరుమలలో వర్షం దంచికొట్టింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం సూర్యప్రభ వాహన సేవ జరిగినంత సేపూ ఎండ తీవ్రత ఉన్నా.. ఆ తర్వాత దట్టమైన నల్లటి మేఘాలు తిరుమలను కప్పేశాయి. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2.30 గంటల వరకు జోరు వర్షం కురిసింది. మళ్లీ రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనసేవ ప్రారంభం కావడానికి 15 నిమిషాల ముందు ఒక్కసారిగా వాతావరణం మారి వర్షం మొదలైంది. అప్పటికే వాహనసేవను తిలకించేందుకు మాడవీధుల్లోని గ్యాలరీల్లోకి భక్తులు భారీగా చేరిపోయారు. వర్షం మొదలుకావడంతో గొడుగులు పట్టుకుని కొందరు, వస్ర్తాలు, ప్లాస్టిక్ కవర్లు, చెత్త కుండీల మూతలు, అట్టముక్కలు వంటి వాటిని తలకు అడ్డుగా పెట్టుకుని గ్యాలరీల్లోనే ఉండిపోయారు. మరికొందరు వర్షంలో తడుస్తూనే వాహనం కోసం ఎదురుచూశారు. చంద్రప్రభ వాహనంలోని ఉత్సవమూర్తి తడిచిపోకుండా ఘటాటోపాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వర్షం నిలిచిపోయినప్పటికీ దట్టమైన పొగమంచు తిరుమలను కప్పేసింది. మరోవైపు వాహనసేవ ముందు కళాబృందాలు తడిచిన నేలపైనే ప్రదర్శనలు ఇచ్చారు. భారీ వర్షం కురవడంతో తిరుమలలో చలి తీవ్రత కూడా పెరిగింది.
ఈ వార్తలనూ చదవండి....
‘హామీల అమలుకు చర్యలు తీసుకోండి’
ఆర్‌వీ నగర్ కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్సవాలకు సీఎం రాక