Share News

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ABN , Publish Date - Oct 02 , 2026 | 05:17 AM

తిరుమలలో గురువారం భక్తుల రద్దీ కొనసాగింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్‌ బాటగంగమ్మ ఆలయ సర్కిల్‌ వరకు వ్యాపించింది.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

సర్వదర్శనానికి 18 గంటలు

తిరుమల, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): తిరుమలలో గురువారం భక్తుల రద్దీ కొనసాగింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్‌ బాటగంగమ్మ ఆలయ సర్కిల్‌ వరకు వ్యాపించింది. వీరికి దాదాపు 18 గంటల దర్శన సమయం పడుతోంది. స్లాటెడ్‌ సర్వదర్శన భక్తులు దాదాపు రెండు నుంచి మూడు గంటల సమయం వేచి ఉండాల్సి వస్తోంది. రద్దీ పెరిగిన నేపథ్యంలో క్యూలైన్లలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను వివిధ విభాగాల అధికారులు పర్యవేక్షిస్తూ, మెరుగైన సేవలు అందిస్తున్నారని టీటీడీ గురువారం ఓ ప్రకటన ద్వారా తెలిపింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పించేలా బ్రేక్‌ దర్శనాలను రద్దు చేశామని టీటీడీ స్పష్టం చేసింది.

ఈ వార్తలనూ చదవండి:

వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు

ప్రభుత్వ భూములకు స్కెచ్‌

Updated Date - Oct 02 , 2026 | 05:18 AM