శాస్త్రోక్తంగా శ్రీవారి చక్రస్నానం
ABN , Publish Date - Oct 22 , 2026 | 03:57 AM
నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన చక్రస్నానం మంగళవారం ఉదయం శాస్త్రోక్తంగా జరిగింది
ముగిసిన నవరాత్రి బ్రహ్మోత్సవాలు
తిరుమల, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన చక్రస్నానం మంగళవారం ఉదయం శాస్త్రోక్తంగా జరిగింది. వేకువజామున 4 నుంచి 6 గంటల వరకు దేవేరులతో సహా మలయప్పస్వామిని తిరుచ్చిలో, చక్రత్తాళ్వార్‌ను పల్లకిలో తిరుమాడ వీధుల గుండా ఊరేగింపుగా వరాహస్వామి ఆలయానికి తీసుకొచ్చారు. ఉదయం 6 నుంచి 8.30గంటల మధ్య ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, ఇత్యాది కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తర్వాత చక్రత్తాళ్వార్‌ను అర్చకస్వాములు పుష్కరిణిలో మూడుమునకలు వేయించారు. పుష్కరిణిలో అప్పటికే వేచి ఉన్న వేలాదిమంది భక్తులు గోవింద నామస్మరణలతో స్నానమాచరించారు. మంగళవారం రాత్రి బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి మాడవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వడంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి.
ఈ వార్తలనూ చదవండి