అదిగో పులి!.. పగలు విశ్రాంతి.. రాత్రి సంచారం!
ABN , Publish Date - Oct 11 , 2026 | 05:03 AM
జనం కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పులి పగలంతా విశ్రాంతి తీసుకుంటూ..
తూర్పుగోదావరి జిల్లా లక్ష్మీపురం వద్ద పులి కదలికలు
డిప్యూటీ సీఎం ఆదేశాలతో అధికారుల పరుగులు
కొవ్వూరు, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): జనం కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పులి పగలంతా విశ్రాంతి తీసుకుంటూ.. రాత్రయితే తిరిగి సంచారం మొదలుపెడుతోంది. జీపీఎస్ సాయంతో ఆయా ప్రదేశాలను అటవీ అధికారులు గుర్తిసున్నారు. శుక్రవారం ఉదయం నుంచీ తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పసలపూడిలో సేదతీరిన పులి.. ఆ తర్వాత చాగల్లు, లక్ష్మీపురం పరిధిలో తిష్టవేసింది. చాగల్లు నుంచి లక్ష్మీపురం వెళ్లే రోడ్‌లో పొలాల వద్ద పులి తిరుగుతుండగా కొందరు రైతులు చూసి పెద్దగా కేకలు పెట్టడంతో అక్కడనుంచి పరుగులు తీసింది. అటవీశాఖ అధికారులు సీసీఎఫ్ జ్యోతి ఆధ్వర్యంలో.. పుణె నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో పులిని పట్టుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పులిని సురక్షితంగా బంధించాలని.. ఇందుకోసం హనుమాన్ బృందాలను మోహరించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించడంతో అధికారుల ప్రయత్నాలు తీవ్రమయ్యాయి.
ఈ వార్తలనూ చదవండి:
ఎవరు అడ్డొచ్చినా నెట్టుకుంటూ పోతాం
దసరాలోపు 2వ విడత తల్లికి వందనం..!