Share News

జీఎన్‌ఎస్‌ఎస్‌ కెనాల్‌లో ముగ్గురు గల్లంతు

ABN , Publish Date - Sep 17 , 2026 | 05:41 AM

నంద్యాల జిల్లా అవుకు మండలంలో జీఎన్‌ఎస్‌ఎస్‌ (గాలేరు-నగరి సుజల స్రవంతి)లో పడి ముగ్గురు గల్లంతయ్యారు. మండలంలోని రామాపురం గ్రామంలో నివసించే అప్రోజ్‌తో పాటు ఆయన కుమారుడు ఆరిష్‌, బావమరిది ఆసిఫ్‌ బుధవారం సాయంత్రం చేపలు పట్టేందుకు జీఎన్‌ఎస్‌ఎస్‌ కెనాల్‌ వద్దకు వెళ్లారు.

జీఎన్‌ఎస్‌ఎస్‌ కెనాల్‌లో ముగ్గురు గల్లంతు

అవుకు, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా అవుకు మండలంలో జీఎన్‌ఎస్‌ఎస్‌ (గాలేరు-నగరి సుజల స్రవంతి)లో పడి ముగ్గురు గల్లంతయ్యారు. మండలంలోని రామాపురం గ్రామంలో నివసించే అప్రోజ్‌తో పాటు ఆయన కుమారుడు ఆరిష్‌, బావమరిది ఆసిఫ్‌ బుధవారం సాయంత్రం చేపలు పట్టేందుకు జీఎన్‌ఎస్‌ఎస్‌ కెనాల్‌ వద్దకు వెళ్లారు. వీరి స్వస్థలం బేతంచెర్ల మండల కేంద్రం. కూలి పనుల నిమిత్తం రామాపురం వచ్చి నాపరాతి ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. మూడు రోజుల క్రితం జీఎన్‌ఎస్‌ఎస్‌ హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా కడప జిల్లాకు 5వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. ఈ క్రమంలో చేపలు పట్టేందుకు వెళ్లిన ముగ్గురూ ప్రమాదవశాత్తు కెనాల్‌లో పడి గల్లంతైనట్టు సమాచారం. ఈ ఘటన నేపథ్యంలో అధికారులు జీఎన్‌ఎస్‌ఎస్‌ గేట్లను మూసివేశారు. చీకటి పడటంతో గాలింపు చర్యలు నిలిచిపోయాయి.


ఈ వార్తలనూ చదవండి:

గంటల వ్యవధిలోనే రోడ్లు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్

ఎక్కువ ధరకు గణేశ్ లడ్డూ వేలం పాడడంపై వివాదం.. వ్యక్తి ఆత్మహత్య

Updated Date - Sep 17 , 2026 | 05:41 AM