Share News

జగన్‌ మేనత్త గ్రామంలో టీడీపీ గెలుపు

ABN , Publish Date - Nov 08 , 2026 | 03:05 AM

జగన్‌ సొంత మేనత్త విమలమ్మ స్వగ్రామమైన ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం నియోజకవర్గం గణపవరంలో ఆపార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.

జగన్‌ మేనత్త గ్రామంలో టీడీపీ గెలుపు

  • గణపవరం ఎంపీటీసీగా రామకృష్ణ విజయం

  • 20 ఏళ్ల తర్వాత టీడీపీకి జైకొట్టిన ప్రజలు

విజయవాడ/ఇబ్రహీంపట్నం, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): జగన్‌ సొంత మేనత్త విమలమ్మ స్వగ్రామమైన ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం నియోజకవర్గం గణపవరంలో ఆపార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గణపవరం ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. రెండు దశాబ్దాలుగా గ్రామంలో కాంగ్రెస్‌, తర్వాత వైసీపీ తరఫున ఎంపీటీసీగా పోటీ చేస్తున్న వారే గెలుపొందుతున్నారు. అయితే, తాజాగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తాళ్ల రామకృష్ణ 285 ఓట్ల మెజారిటీతో విజయం దక్కించుకున్నారు. ఇదే స్థానం నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి సందిపాము రమేశ్‌ పరాజయం పాలయ్యారు. కాగా, 20 ఏళ్ల తర్వాత దక్కిన విజయంతో కూటమి నేతలు సంబరాల్లో మునిగిపోయారు.

ఈ వార్తలనూ చదవండి:

కూటమి.. సునామీ

ఫలించిన మంత్రి కొండపల్లి వ్యూహం.. బొత్స కూతురిపై సామాన్య మహిళ గెలుపు..

Updated Date - Nov 08 , 2026 | 03:09 AM