Share News

12 జిల్లాల్లో వైసీపీ 0

ABN , Publish Date - Nov 21 , 2026 | 01:54 AM

రాష్ట్రవ్యాప్తంగా 659 మండలాలు ఉండగా... 17 మినహా అన్ని మండలాలకు అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది.

12 జిల్లాల్లో వైసీపీ 0

  • ఇవీ మండలాల లెక్కలు

  • రాష్ట్రవ్యాప్తంగా 659 మండలాలు ఉండగా... 17 మినహా అన్ని మండలాలకు అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది.

  • అధ్యక్ష ఎన్నిక పూర్తయిన 642 మండలాల్లో... 547 టీడీపీ, 44 జనసేన, 7 చోట్ల బీజేపీ నేతలు మండలాధ్యక్షులుగా ఎన్నికయ్యారు.

  • రాష్ట్రంలోని 12 జిల్లాల్లో వైసీపీకి ఒక్కటంటే ఒక్క మండలాధ్యక్ష పదవీ దక్కలేదు. జగన్‌ సొంతజిల్లా కడప కూడా ఈ జాబితాలో ఉంది. వైసీపీ 6 జిల్లాల్లో ఒక్కో మండలానికి పరిమితమైంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏడు మండలాలు వైసీపీ ఖాతాలో పడ్డాయి. రాష్ట్రంలో మొత్తంగా వైసీపీకి ఉన్న ఎంపీపీలు 40 మంది.

  • అనకాపల్లి జిల్లాలో సీపీఎం ఒక మండలాన్ని దక్కించుకోగా, మండలాల్లో కాంగ్రెస్‌ ఉనికేలేదు.

  • రాష్ట్రంలో అత్యంత తక్కువగా విశాఖ జిల్లాలో కేవలం నాలుగు ఎంపీపీ స్థానాలే ఉన్నాయి.

ఈ వార్తలనూ చదవండి:

పంట నష్టంపై సాయం అందించండి.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌కు చంద్రబాబు వినతి

తాడిపత్రిలో హైటెన్షన్.. టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడి

Updated Date - Nov 21 , 2026 | 02:00 AM