నంద్యాలలో సైకిల్ జోరు
ABN , Publish Date - Nov 08 , 2026 | 05:15 AM
నంద్యాల జిల్లాలో పరిషత్ ఎన్నికల్లో సైకిల్ జోరు పెంచింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 28 జడ్పీటీసీ స్థానాల్లో 23 స్థానాలు కైవసం చేసుకుంది.
23 జడ్పీటీసీ స్థానాలు టీడీపీ కైవసం
5 స్థానాలతో సరిపెట్టుకున్న వైసీపీ
376 ఎంపీటీసీల్లో టీడీపీకి 223
వైసీపీ 141, జనసేన 7, బీజేపీ 2
నంద్యాల, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాలో పరిషత్ ఎన్నికల్లో సైకిల్ జోరు పెంచింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 28 జడ్పీటీసీ స్థానాల్లో 23 స్థానాలు కైవసం చేసుకుంది. వైసీపీ 5 స్థానాలతో సరిపెట్టుకుంది. కూటమి పొత్తులో గడివేముల, గోస్పాడు మండలాల్లో పోటీ చేసిన బీజేపీ, జనసేన అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. ఎంపీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు సత్తా చాటినా వైసీపీ కూడా గట్టి పోటీని ఇచ్చింది. మొత్తం 376 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి 232 (టీడీపీ 223, జనసేన 7, బీజేపీ 2) గెలుపొందింది. వైసీపీ 141, ఇతరులు 3 స్థానాల్లో విజయం సాధించారు. జడ్పీటీసీల పరంగా అత్యధికంగా ఆళ్లగడ్డ నియోజకర్గంలో శిరివెళ్ల టీడీపీ అభ్యర్థి శ్రీకాంత్‌రెడ్డి 24,258 ఓట్లతో, చాగలమర్రి టీడీపీ అభ్యర్థి నరసింహారెడ్డి 17,275 ఓట్లు, ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి 15,745 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
ఈ వార్తలనూ చదవండి:
ఫలించిన మంత్రి కొండపల్లి వ్యూహం.. బొత్స కూతురిపై సామాన్య మహిళ గెలుపు..