స్థానికంలో ధిక్కారంపై వేటు
ABN , Publish Date - Oct 31 , 2026 | 01:32 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అధిష్ఠానం నిర్ణయానికి వ్యతిరేకంగా బరిలో ఉన్న11 మందిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం ఆయా జిల్లాల అధ్యక్షులు ప్రకటనలు చేశారు.
11 మంది రెబెల్స్‌ను సస్పెండ్ చేసిన టీడీపీ అధిష్ఠానం
అమరావతి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అధిష్ఠానం నిర్ణయానికి వ్యతిరేకంగా బరిలో ఉన్న11 మందిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం ఆయా జిల్లాల అధ్యక్షులు ప్రకటనలు చేశారు. అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఎటపాక మండల మాజీ అధ్యక్షుడు మువ్వా శ్రీనివాస్, మాజీ వైఎస్ ఎంపీపీ దొంతు మంగేశ్వరరావు, విజయనగరం జిల్లా బొబ్బలి నియోజకవర్గం రామభద్రపురం మండలానికి చెందిన సామంతుల ఉమామహేశ్వరరావు, నెల్లిమర్ల నియోజకవర్గం పూసపాటిరేగ మండలానికి చెందిన పుసుపులేటి లలిత కళను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
అలాగే, కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గానికి చెందిన కృష్ణా జిల్లా టీడీపీ మాజీ ఉపాధ్యక్షుడు నన్నపనేని వీరేంద్ర, కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆలూరు మండలానికి చెందిన బెంగళూరు కిశోర్, హోళగుండ మండలానికి చెందిన గోవిందు గౌడ్, శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిగి మండలానికి చెందిన బోయ నాగప్పని. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం మండలానికి చెందిన బి,ఇందిరమ్మ, ఆమె కుమార్తె సి.శిరీషను సస్పెండ్ చేశారు. తిరుపతి జిల్లా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన దొడ్డరెడ్డి రామకృష్ణా రెడ్డిపై కూడా వేటు పడింది.
ఈ వార్తలనూ చదవండి:
ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?