వైసీపీ విధ్వంసాలను ప్రజలు తిరస్కరించారు: పల్లా
ABN , Publish Date - Nov 08 , 2026 | 04:35 AM
‘పట్టణం నుంచి పల్లె వరకు కూటమి సుపరిపాలనకు ప్రజలు పట్టం కట్టారు. వైసీపీ ఎన్ని విధ్వంసాలు సృష్టించినా ప్రజలు ధైర్యంగా ఓటేసి కూటమికి జై కొట్టారు’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.
అమరావతి, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): ‘పట్టణం నుంచి పల్లె వరకు కూటమి సుపరిపాలనకు ప్రజలు పట్టం కట్టారు. వైసీపీ ఎన్ని విధ్వంసాలు సృష్టించినా ప్రజలు ధైర్యంగా ఓటేసి కూటమికి జై కొట్టారు’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, రిగ్గింగ్ జరిగిందని జగన్ ఆరోపణలు చేయడం దారుణం.
జగన్ విధ్వంస పాలన ప్రజల మనసుల్లో ఎంత చెరగని ముద్ర వేసిందో ఈ ఫలితాలు మరోసారి రుజువు చేశాయి. రాష్ట్ర ప్రజలకు సంక్షేమంతోపాటు అభివృద్ధి ఫలాలనూ అందిస్తున్నాం. అందుకే 95 శాతం స్ట్రైక్ రేటు సాధ్యమైంది. 2029 ఎన్నికల్లో కూడా ఇదే విజయాన్ని కొనసాగిస్తాం’ అని పల్లా ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
ఫలించిన మంత్రి కొండపల్లి వ్యూహం.. బొత్స కూతురిపై సామాన్య మహిళ గెలుపు..