పంచాయతీల్లోనూ కూటమికి పట్టం కట్టండి: పల్లా
ABN , Publish Date - Nov 18 , 2026 | 12:47 AM
‘రాష్ట్ర ప్రగతికి గ్రామాలే పునాదులు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒకే పాలనా దిశ, సమన్వయం ఉంటే అభివృద్ధి సజావుగా సాగుతుంది’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరవు అన్నారు.
అమరావతి, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్ర ప్రగతికి గ్రామాలే పునాదులు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒకే పాలనా దిశ, సమన్వయం ఉంటే అభివృద్ధి సజావుగా సాగుతుంది’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరవు అన్నారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘పంచాయతీ ఎన్నికల్లోనూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కోరారు. పురపాలికలు, పరిషత్ ఎన్నికల్లో కూటమి పార్టీలు ఏ విధంగా సమన్వయంతో ముందుకు సాగాయో... అదే ఐక్యత, స్ఫూర్తితో రానున్న పంచాయతీ ఎన్నికల్లోనూ కలసి పనిచేస్తారు’ అని పల్లా పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు