Share News

సీమంతానికి 10 వేలు

ABN , Publish Date - Nov 29 , 2026 | 03:29 AM

శ్రీసత్యసాయి జిల్లాలో టీడీపీ మద్దతుతో సర్పంచ్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థి ఓటర్లకు వినూత్న హామీ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికలలో తనను గెలిపిస్తే గర్భిణుల సీమంతానికి ...

సీమంతానికి 10 వేలు

  • ఆడబిడ్డ పుడితే మరో 10 వేలు డిపాజిట్‌ చేస్తా

పెనుకొండ టౌన్‌, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లాలో టీడీపీ మద్దతుతో సర్పంచ్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థి ఓటర్లకు వినూత్న హామీ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికలలో తనను గెలిపిస్తే గర్భిణుల సీమంతానికి రూ.10 వేలు ఇస్తానని, ఆడబిడ్డ పుడితే మరో రూ.10 వేలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తానని ప్రకటించారు. పెనుకొండ మండలం గుట్టూరు గ్రామ పంచాయతీలో సర్పంచ్‌ అభ్యర్థిగా టీడీపీ కూటమి తరఫున గుట్టూరు సూర్యనారాయణ బరిలో దిగారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయన ఇలా కానుకల హామీ ఇచ్చారు.

ఈ వార్తలనూ చదవండి:

అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్‌ చెక్..

నేడే రెండో విడత పల్లె సమరం

Updated Date - Nov 29 , 2026 | 03:32 AM