Share News

నాడు టీడీపీ ఆఫీసు... నేడు శాప్‌ కార్యాలయం

ABN , Publish Date - Sep 23 , 2026 | 04:26 AM

విజయవాడ శాప్‌ కార్యాలయం వద్ద డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా ఉపాధ్యాయులపై జరిగిన దాడి ఘటనను చూసినవారు.. టీడీపీ కేంద్ర కార్యాలయంపై నాడు జరిగిన దాడిని గుర్తు చేసుకుంటున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డవారే విజయవాడలో సోమవారం విధ్వంసానికి పాల్పడ్డారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

నాడు టీడీపీ ఆఫీసు... నేడు శాప్‌ కార్యాలయం

  • అక్కడా.. ఇక్కడా చెలరేగింది అదే రౌడీషీటర్లు

గుంటూరు, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): విజయవాడ శాప్‌ కార్యాలయం వద్ద డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా ఉపాధ్యాయులపై జరిగిన దాడి ఘటనను చూసినవారు.. టీడీపీ కేంద్ర కార్యాలయంపై నాడు జరిగిన దాడిని గుర్తు చేసుకుంటున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డవారే విజయవాడలో సోమవారం విధ్వంసానికి పాల్పడ్డారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. నాడు, నేడు కూడా గుంటూరుకు చెందిన రౌడీషీటర్లే చెలరేగిపోయారని అంటున్నాయి. శాప్‌ కార్యాలయం వద్ద జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ దృశ్యాల్లో కనిపిస్తున్న వ్యక్తుల వివరాలను సేకరించే క్రమంలో గుంటూరు జిల్లా తెనాలి, తుళ్లూరు, గుంటూరు నగర పరిధికి చెందిన రౌడీషీటర్లు పాల్గొన్నట్లు గుర్తించారు.


పోలీసుల పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్న పేర్లలో వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడు, రౌడీషీటర్‌ పానుగంటి చైతన్య, తెనాలి ఐతానగర్‌కు చెందిన రౌడీషీటర్‌ గుడ్డేటి సురేంద్ర, తాడికొండ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్‌ శృంగారపాటి సందీప్‌, లాలాపేట స్టేషన్‌లో రౌడీషీటర్‌ అయిన రబ్బాని, గుంటూరుకు చెందిన బంక అరుణ్‌, వెంకట్‌, నవ్యాంధ్ర ఎంఆర్‌పీఎస్‌ అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు, వైసీపీ మాజీ కార్పొరేటర్‌, వైసీపీ గ్రీవెన్స్‌సెల్‌ ఇన్‌చార్జ్‌ అంకంరెడ్డి నారాయణమూర్తి, వైసీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాశ్‌, పల్నాడు జిల్లా అబ్బూరుకు చెందిన నాగార్జున యాదవ్‌, స్తంభాలగరువుకు చెందిన చల్లా శివకోటి, ప్రభు, మున్నా, నల్లపాడు స్టేషన్‌ పరిధికి చెందిన తేజ, నగరంపాలెం పరిధిలోని డి కిరణ్‌, అరండల్‌పేట స్టేషన్‌ పరిధిలోని పూనూరు నాగేశ్వరరావు, మాజీ కార్పొరేటర్‌ ఈచంపాటి కృష్ణమాచారి అలియాస్‌ ఆచారి, మాజీ కార్పొరేటర్‌ భర్త కిశోర్‌, ధూపాటి సాల్మన్‌, దాసరి గోపి, పేటేటి నవీన్‌, సాజిద్‌, భాను, గనికె ఝాన్సీ, లాలాపేట స్టేషన్‌ పరిధికి చెందిన మహబూబ్‌ షరీఫ్‌, పట్టాభిపురం పరిధికి చెందిన పెప్సీ రాజేశ్‌, తుఫాన్‌నగర్‌కు చెందిన బాబు, కొలకలూరి కోటేశ్వరరావు, గజ్జల సుధీర్‌, తెనాలికి చెందిన మంజరి చౌదరి, లాలాపేట స్టేషన్‌ పరిధికి చెందిన మిర్చియార్డు మాజీ చైర్మన్‌ సుధాకర్‌రెడ్డి, కొత్తపేట ప్రాంతానికి చెందిన కొండారెడ్డి, పాతగుంటూరు ప్రాంతానికి చెందిన దానం వినోద్‌, విఘ్నేశ్‌ రాఖీ, లాలాపేట స్టేషన్‌ పరిధిలోని కొరిటిపాటి ప్రేమ్‌, నగరంపాలెం పోలీస్‌ స్టేషన్‌ ప్రాంతానికి చెందిన గేదెల రమేశ్‌ తదితరులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

నిఘా ఏది?

రౌడీషీటర్లపై నిఘా ఉంచకపోవడం... కనీసం ప్రతి ఆదివారం పోలీస్‌ స్టేషన్‌లలో జరిగే కౌన్సెలింగ్‌కు పిలకపోవడంతో వారు మరింతగా రెచ్చిపోతున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడిలో పాల్గొన్న మాజీ రౌడీషీటర్‌లపై తిరిగి షీట్‌లు తెరవలేదు. దీంతో వారు యథేచ్ఛగా రప్పారప్పా సంస్కృతి కొనసాగిస్తున్నారని చెబుతున్నారు.

ఈ వార్తలనూ చదవండి...

పాదగయలో విషాదం.. పుష్కరిణిలో స్నానానికి దిగి యువకుడి గల్లంతు..

సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

Updated Date - Sep 23 , 2026 | 04:26 AM