‘భూ సాగుదారులకు పట్టాలివ్వాలి’
ABN , Publish Date - Sep 22 , 2026 | 11:26 PM
నారాయణపురం భూములను తరతరాలుగా సాగు చేస్తున్న రైతులకు పట్టాలివ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యవర్గసభ్యుడు మోహనరావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి. తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు అమ్మన్నాయుడు కోరారు. ఇదే డిమాండ్‌తో చేపట్టిన పాదయాత్ర రెండో రోజు మంగళవారం కలెక్టరేట్ వద్దకు చేరుకుంది.
అరసవల్లి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): నారాయణపురం భూములను తరతరాలుగా సాగు చేస్తున్న రైతులకు పట్టాలివ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యవర్గసభ్యుడు మోహనరావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి. తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు అమ్మన్నాయుడు కోరారు. ఇదే డిమాండ్‌తో చేపట్టిన పాదయాత్ర రెండో రోజు మంగళవారం కలెక్టరేట్ వద్దకు చేరుకుంది. జోరువానను సైతం లెక్కచేయకుండా వృద్ధులు, పిల్లలు కూడా ఈ పాదయాత్ర లో పాల్గొన్నారు. గత 50 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా సరే ప్రభుత్వాలు పట్టిం చుకోకపోవడం దారుణ మన్నారు. తప్పుడు పత్రాలు సృష్టించి, రికార్డులు తారు మారు చేసిన వారిపై ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించా రు. తక్షణం తగు చర్యలు తీసుకుని హక్కుపత్రాలివ్వాలని కోరారు. అనంతరం జా యింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్ర మంలో పలు సంఘాల ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.