గెలుపు ఆనందం ఆవిరై...
ABN , Publish Date - Nov 10 , 2026 | 01:43 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం వరించింది. ఫలితాల అనంతరం అందరితో ఆనందాన్ని పంచుకున్నారు. అంతలోనే ఆనందం ఆవిరైంది.
ఎంపీటీసీ ఆకస్మిక మృతి
ఆలూరు, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం వరించింది. ఫలితాల అనంతరం అందరితో ఆనందాన్ని పంచుకున్నారు. అంతలోనే ఆనందం ఆవిరైంది. కర్నూలు జిల్లా ఆలూరు-4 ఎంపీటీసీ స్థానం నుంచి గెలుపొందిన టీడీపీ అభ్యర్థి బోయ లక్ష్మి(50) మృతి చెందారు. ఫలితాల అనంతరం ఇంటికి వెళ్లగానే ఆమెకు ఒక్కసారిగా బీపీ పెరిగిపోయింది. దీంతో ఆమెను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఈ వార్తలనూ చదవండి: