నెల్లూరు టీడీపీదే
ABN , Publish Date - Nov 04 , 2026 | 03:46 AM
నెల్లూరు జిల్లా పరిధిలో ఎన్నికలు జరిగిన నెల్లూరు కార్పొరేషన్, బుచ్చిరెడ్డిపాలెం, ఆత్మకూరు మున్సిపాలిటీల్లో కూటమి విజయభేరి మోగించింది.
మేయర్‌గా రూప్‌కుమార్ యాదవ్
బుచ్చి, ఆత్మకూరుల్లోనూ కూటమి విజయభేరి
నెల్లూరు జిల్లా పరిధిలో ఎన్నికలు జరిగిన నెల్లూరు కార్పొరేషన్, బుచ్చిరెడ్డిపాలెం, ఆత్మకూరు మున్సిపాలిటీల్లో కూటమి విజయభేరి మోగించింది. టీడీపీకి చెందిన నెల్లూరు మేయర్ అభ్యర్థి రూప్‌కుమార్ యాదవ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 72 డివిజన్లలో 8 ఏకగ్రీవం కాగా.. ఎన్నికలు జరిగిన 64 డివిజన్లలో 56 కూటమిపరమయ్యాయి. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో టీడీపీ అభ్యర్థి దొడ్ల విజయలక్ష్మి ఘనవిజయం సాధించారరు. మొత్తం 28 వార్డుల్లో కూటమికి 24 వచ్చాయి. వైసీపీ నాలుగుకే పరిమితమైంది. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇలాకాలోని ఆత్మకూరు మున్సిపాలిటీలో హోరాహోరీ పోరు జరిగింది. టీడీపీకి చెందిన చైర్‌పర్సన్ అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీల గెలుపొందారు. మొత్తం 28 వార్డుల్లో కూటమికి 16 మాత్రమే దక్కాయి. వైసీపీ 10 చోట్ల, స్వతంత్రులు రెండు చోట్ల విజయం సాధించారు.
ఈ వార్తలనూ చదవండి:
కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం