Share News

‘కూనవరం’లో తొలిసారి టీడీపీ విజయం!

ABN , Publish Date - Nov 30 , 2026 | 01:49 AM

పోలవరం జిల్లాలోని కూనవరం మండల పరిధిలో ఉన్న మర్రిగూడెం, వెంకటాయపాలెం పంచాయతీలలో టీడీపీ తొలిసారి విజయం దక్కించుకుంది

‘కూనవరం’లో తొలిసారి టీడీపీ విజయం!
tdp

  • పోలవరం జిల్లా మర్రిగూడెం, వెంకటాయపాలెంలో గెలుపొందిన టీడీపీ సర్పంచ్‌ మద్దతుదారులు

కూనవరం, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): పోలవరం జిల్లాలోని కూనవరం మండల పరిధిలో ఉన్న మర్రిగూడెం, వెంకటాయపాలెం పంచాయతీలలో టీడీపీ తొలిసారి విజయం దక్కించుకుంది. పార్టీ స్థాపించిన తర్వాత.. ఈ రెండు పంచాయతీల్లోనూ టీడీపీ మద్దతుదారులు ఇప్పటి వరకు గెలుపు గుర్రం ఎక్కలేదు. అలాంటి ఈ సారి బలమైన ప్రచారం, మద్దతుదారుల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకున్న కారణంగా.. ఈ రెండు పంచాయతీల్లోనూ పార్టీ విజయం సాధించిందని నాయకులు తెలిపారు. మర్రిగూడెం పంచాయతీలో టీడీపీ నుంచి పోటీ చేయడానికి గతంలో వార్డు మెంబర్‌ కూడా దొరికేవారు కాదు.

kunavaram.jpgఆది నుంచి అక్కడ కాంగ్రెస్‌ పార్టీ గెలుపొందుతూ వచ్చింది. గత పంచాయతీ ఎన్నికల్లో సైతం రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఎక్కడా గెలవకపోయినా మర్రిగూడెం పంచాయతీలో మాత్రమే గెలిచి తమ ఓటు బ్యాంకు నిలబెట్టుకుంది. అయితే, ఈసారి ఆ లెక్కలు తారుమారయ్యాయి. టీడీపీ తొలిసారి అక్కడ అభ్యర్థిని నిలబెట్టి సర్పంచ్‌ స్థానాన్ని కైవసం చేసుకుంది. వైసీపీ మద్దతుదారు చిచ్చడి మంజులపై టీడీపీ మద్దతుదారు వంజం శారద 158 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మర్రిగూడెంలో మొత్తం 550 ఓట్లు ఉండగా, ఆదివారం జరిగిన ఎన్నికల్లో 432 ఓట్లు పోలయ్యాయి. వీటిలో టీడీపీ మద్దతుదారు 158 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సర్పంచ్‌ స్థానంతో పాటు ఉపసర్పంచ్‌ పదవిని కూడా టీడీపీ మద్దతుదారులే కైవసం చేసుకున్నారు. అలాగే, కూనవరం మండలంలోని వెంకటాయపాలెం పంచాయతీలోనూ టీడీపీ మద్దతుదారు తొలిసారి విజయం సాధించారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారు మడకం వెంకటేశ్వర్లు 650 ఓట్ల మెజార్టీతో వైసీపీ మద్దతుదారుపై గెలుపొందారు.

ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?

అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!

Updated Date - Nov 30 , 2026 | 03:37 AM