Share News

వైసీపీ అరాచకాలు మితిమీరాయి: వర్ల

ABN , Publish Date - Nov 18 , 2026 | 02:20 AM

‘పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి వైసీపీ శ్రేణులు, అసాంఘిక శక్తులు దాడులు, అల్లర్లకు పాల్పడుతున్నాయి. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి’ అని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు.

వైసీపీ అరాచకాలు మితిమీరాయి: వర్ల

అమరావతి, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): ‘పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి వైసీపీ శ్రేణులు, అసాంఘిక శక్తులు దాడులు, అల్లర్లకు పాల్పడుతున్నాయి. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి’ అని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు టీడీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఏ.మల్లికార్జున, ఐజీ రాజకుమారిని కలసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ఆధారాలను అందజేశారు. జగన్‌ నాయకత్వంలోని వైసీపీ శ్రేణులు కడప, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కుతూ దాడులకు పాల్పడుతున్నాయని టీడీపీ బృందం పేర్కొంది. గుంటూరు జైలులో ఉన్న లేళ్ల అప్పిరెడ్డిని పరామర్శించేందుకు వైసీపీ నేతలు పెద్దిరెడ్డి, సజ్జల సుమారు 500 మంది అనుచరులను వెంటబెట్టుకుని వెళ్లడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదులో తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

పరీక్షల పరేషాన్‌

అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

Updated Date - Nov 18 , 2026 | 02:20 AM