Share News

తల్లి కార్పొరేటర్‌.. కూతురు మేయర్‌

ABN , Publish Date - Nov 05 , 2026 | 05:19 AM

కర్నూలు నగర పాలక సంస్థ ఎన్నికల్లో 68వ వార్డుకు టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్థిగా పోటీ చేసిన బొల్లెద్దుల సరస్వతమ్మ 1,078 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

తల్లి కార్పొరేటర్‌.. కూతురు మేయర్‌

కర్నూలులో ఆ కుటుంబానికి డబుల్‌ ధమాకా

కర్నూలు నగర పాలక సంస్థ ఎన్నికల్లో 68వ వార్డుకు టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్థిగా పోటీ చేసిన బొల్లెద్దుల సరస్వతమ్మ 1,078 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆమె పెద్ద కూతురు బొల్లెద్దుల విజయ ప్రత్యూష మేయర్‌ పదవికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి, 27,033 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. కాగా, ఆమె రెండో కుమార్తె బొల్లెద్దుల సాయి ప్రియాంక కూడా మేయర్‌ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 1,872 ఓట్లు సాధించారు. కూతురు మేయర్‌గా, తల్లి కార్పొరేటరుగా నగర పాలికలో అడుగు పెట్టడం గమనార్హం.

- కర్నూలు, ఆంధ్రజ్యోతి

ఈ వార్తలనూ చదవండి:

ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్

ఫోర్జరీ, చీటింగ్‌ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్‌

Updated Date - Nov 05 , 2026 | 05:19 AM