గుంటూరు, పల్నాడులో కూటమి కేక
ABN , Publish Date - Nov 04 , 2026 | 06:33 AM
గుంటూరు నగర మేయర్‌గా టీడీపీకి చెందిన కె. లక్ష్మీఅపర్ణ ఘన విజ యం సాధించారు. లక్ష ఓట్లకుపైగా మెజారిటీతో ఆమె వైసీపీ అభ్యర్థి శ్రీదేవిపై గెలుపొందారు.
గుంటూరు నగర మేయర్‌గా టీడీపీకి చెందిన కె. లక్ష్మీఅపర్ణ ఘన విజ యం సాధించారు. లక్ష ఓట్లకుపైగా మెజారిటీతో ఆమె వైసీపీ అభ్యర్థి శ్రీదేవిపై గెలుపొందారు. గుంటూరు నగరంలో 2024 ఎన్నికల కంటే ఎక్కువ ఆధిక్యం ఆమెకు దక్కడం విశేషం. ఇక్కడ 76 డివిజన్లకు గాను కూటమి 64 చోట్ల విజయం సాధించింది. వైసీపీకి 11 మాత్రమే దక్కాయి. ఇక పల్నాడు జిల్లాలో నామినేషన్ల ఉపసంహరణ నాటికే పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల ఏకగ్రీవంగా కూటమిపరమయ్యాయి. మిగిలిన మాచర్ల, చిలకలూరిపేట, సత్తెనపల్లి, వినుకొండల్లో ఎన్నికలు జరుగగా.. నాలుగూ కూటమి ఖాతాలో పడ్డాయి. దీంతో జిల్లాలో రాజకీయంగా కూటమి పార్టీల పట్టు మరింతగా బిగిసింది.
మాచర్లలో టీడీపీకి చెందిన యెనుముల సుష్మ భారీ మెజారిటీతో గెలుపొందారు. 36 వార్డులకు గాను 32 టీడీపీకి, 3 జనసేనకు, ఒకటి బీజేపీకి దక్కాయి. వైసీపీకి ఒక్కటి కూడా రాలేదు. వినుకొండలో టీడీపీకి చెందిన షమీమ్‌ఖాన్ గెలుపొందారు. ఇక్కడి 36 వార్డులకు టీడీపీ 21 చోట్ల విజయం సాధించగా, వైసీపీ 8 స్థానాలకు పరిమితమైంది. బీజేపీ, జనసేన మూడేసి, సీపీఐ ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి. సత్తెనపల్లి చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి ఎం.రామాంజనేయులు ఎన్నికయ్యారు.
ఇక్కడి 36 వార్డుల్లో కూటమికి 27, వైసీపీకి 9 దక్కాయి. చిలకలూరిపేటలో జనసేనకు చెందిన చైర్పర్సన్ అభ్యర్థి తోట రాజరాజేశ్వరి ఆధిక్యంలో ఉన్నారు. 48 వార్డులకు గాను టీడీపీ 39. జనసేన 6, బీజేపీ 1, వైసీపీ 2 వార్డులలో విజయం సాధించాయి. గుంటూరు జిల్లా తెనాలిలో జనసేనకు చెందిన టి.వెంకటరమణరావు విజయం సాధించారు. 52 వార్డుల్లో కూటమి ఏకంగా 46 గెలుచుకుంది. వైసీపీకి ఆరు మాత్రమే దక్కాయి. ఇక బాపట్ల జిల్లా రేపల్లెలో టీడీపీకి చెందిన కుర్రా అపర్ణ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. 36 వార్డుల్లో 32 కూటమి ఖాతాలో పడ్డాయి.
ఈ వార్తలనూ చదవండి:
కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం