స్పందన సరే.. వేగం!?
ABN , Publish Date - Nov 22 , 2026 | 08:06 AM
‘పెట్టుబడిదారుల విజ్ఞప్తులపై అదే రోజు స్పందించడమే మా విజయ రహస్యం. దీనిని ఎవరైనా కాపీ కొట్టుకోవచ్చు’... అంటూ మంత్రి లోకేశ్ చేసిన వ్యాఖ్యలకు తమిళనాడు పరిశ్రమల మంత్రి కీర్తన కౌంటర్ ఇచ్చారు.
అది మరింత మంచిది
లోకేశ్‌కు తమిళనాడు పరిశ్రమల మంత్రి కౌంటర్
చెన్నై, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): ‘పెట్టుబడిదారుల విజ్ఞప్తులపై అదే రోజు స్పందించడమే మా విజయ రహస్యం. దీనిని ఎవరైనా కాపీ కొట్టుకోవచ్చు’... అంటూ మంత్రి లోకేశ్ చేసిన వ్యాఖ్యలకు తమిళనాడు పరిశ్రమల మంత్రి కీర్తన కౌంటర్ ఇచ్చారు. ‘స్పందన మంచిదే. కానీ, మరింత వేగంగా అమలు చేయడం? అది ఇంకా మంచిది’ అంటూ ఆమె ఎక్స్‌లో వ్యాఖ్యానించారు. పెట్టుబడుల విషయంలో తాజాగా ఏపీ, తమిళనాడు మధ్య ‘గూఢచర్యం’ వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. తమిళనాడులో ఈనెల 25వ తేదీ నుంచి ‘వెట్రి ఇన్వె్‌స్టమెంట్ అండ్ కన్వర్షన్ కాంక్లేవ్ 2026’ జరగనుంది.
దీనిపై రాష్ట్ర పరిశ్రమల మంత్రి కీర్తన ‘ఎక్స్’లో స్పందిస్తూ... ‘‘సీఎం విజయ్ నాయకత్వంలో మేం పెట్టుబడి హామీలను స్పష్టమైన ఫలితాలుగా మార్చడంపైనా, క్షేత్రస్థాయిలో ఫలితాలను అందించడంపైనా దృష్టి సారించాం. మరో 4 రోజులే మిగిలి ఉన్నాయి. 25 నవంబరు 2026’’ అని పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
బెంగళూరుకు షర్మిల.. అడ్డుకునేందుకు జగన్ భారీ స్కెచ్..?
కేబీసీ సీజన్ 18 మొదటి కోటీశ్వరుడిగా యూపీఎస్సీ అభ్యర్థి