Share News

‘ఆర్టీసీ’తో జేఏసీ చర్చలు విఫలం

ABN , Publish Date - Oct 24 , 2026 | 05:15 AM

ఆర్టీసీ అధికారులతో శుక్రవారం విజయవాడ ఆర్టీసీ హౌస్‌లో నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. చర్చలలో ఎలక్ట్రిక్‌ బస్సులకు పిలిచిన టెండర్లను రద్దు చేయాలని నాయకులు కోరగా, అది ప్రభుత్వ నిర్ణయమని, రద్దు చేయడానికి వీలుకాదని జాయుంట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శివప్రసాద్‌ తేల్చి చెప్పారు.

‘ఆర్టీసీ’తో జేఏసీ చర్చలు విఫలం

  • ఎలక్ట్రికల్‌ బస్సుల టెండర్లు రద్దు లేదన్న అధికారులు

విజయవాడ అర్బన్‌ (బస్‌స్టేషన్‌) అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ అధికారులతో శుక్రవారం విజయవాడ ఆర్టీసీ హౌస్‌లో నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. చర్చలలో ఎలక్ట్రిక్‌ బస్సులకు పిలిచిన టెండర్లను రద్దు చేయాలని నాయకులు కోరగా, అది ప్రభుత్వ నిర్ణయమని, రద్దు చేయడానికి వీలుకాదని జాయుంట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శివప్రసాద్‌ తేల్చి చెప్పారు. అనంతరం జేఏసీ కన్వీనర్లు వై.శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ, ప్రజా రవాణా వ్యవస్థను ప్రైవేట్‌ పరం చేయవద్దని, 1450 విద్యుత్‌ బస్సుల కోసం పిలిచిన టెండర్లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశామన్నారు. చర్చలు విఫలం కావడంతో భవిష్యత్‌లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

పల్లె పండుగకు నిధుల గండం

ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Updated Date - Oct 24 , 2026 | 05:15 AM