Share News

ఆక్వా మార్కెట్‌ ఫీజు పెంపుపై స్టే ఇవ్వలేం

ABN , Publish Date - Nov 06 , 2026 | 05:09 AM

ఆక్వా ఎగుమతులపై వ్యవసాయ మార్కెట్‌ ఫీజును పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మధ్యంతర ఉత్తర్వులు(స్టే) ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

ఆక్వా మార్కెట్‌ ఫీజు పెంపుపై స్టే ఇవ్వలేం

  • రాష్ట్ర ప్రభుత్వం, ఏఎంసీలకు సుప్రీం నోటీసులు..

  • తదుపరి విచారణ వచ్చే నెల 4కి వాయిదా

న్యూఢిల్లీ, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): ఆక్వా ఎగుమతులపై వ్యవసాయ మార్కెట్‌ ఫీజును పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మధ్యంతర ఉత్తర్వులు(స్టే) ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రొయ్యలు, పీతల ఎగుమ తులపై మార్కెట్‌ ఫీజును 0.25 శాతం నుంచి 1 శాతానికి పెంచుతూ 2022 ఏప్రిల్‌ 22న రాష్ట్ర ప్రభుత్వం జీవో 27 జారీ చేసింది. దీనిని సవాల్‌ చేస్తూ 15 ఆక్వా సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ హైకోర్టు ఈ ఏడాది సెప్టెంబరు 18న తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆ సంస్థలు అక్టోబరు 13న సుప్రీంకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యాలు జస్టిస్‌ పార్దీవాలా, జస్టిస్‌ మన్మోహన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట గురువారం విచారణకు వచ్చాయి.

పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు, అల్లంకి రమేష్‌ హాజరై వాదనలు వినిపించారు. మార్కెట్‌ కమిటీలు కల్పించే సదు పాయాలను ఎగుమతి సంస్థలు ఏమాత్రం వినియోగించుకోవడం లేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. తమపై మార్కెట్‌ ఫీజు విధించే అధికారం కమిటీలకు లేదన్నారు. ఏపీ మార్కెట్‌ చట్టంలోని నిబంధనల (సెక్షన్‌ 12) ప్రకారం నోటి ఫైడ్‌ మార్కెట్‌ యార్డులో వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసినప్పుడు, విక్రయించినప్పుడు మాత్రమే ఫీజు విధించాల్సి ఉంటుందని తెలిపారు

. అయితే మార్కెట్‌ యార్డులతో సంబంధం లేకుండా చెరువుల వద్దే ముడి రొయ్యలను కొనుగోలు చేస్తున్నామని, అయినప్పటికీ తమ వద్ద ఫీజు వసూలు చేయడం సరికాదని అన్నారు. పెంచిన ఫీజు వసూళ్లపై స్టే ఇవ్వాలని కోరారు. ఈ అభ్య ర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వం, మార్కెట్‌ కమిటీలకు దస్తీ (వ్యక్తిగతంగా) ద్వారా నోటీసులు అందజేయాలని పిటిషనర్లను ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబరు 4కి వాయిదా వేసింది.

ఈ వార్తలనూ చదవండి:

ఓటెత్తిన పల్లెలు

అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ

Updated Date - Nov 06 , 2026 | 05:11 AM