Share News

పదేళ్లు జైలులో ఉంటే బెయిల్‌ ఇవ్వాలా?: సుప్రీం ప్రశ్న

ABN , Publish Date - Nov 24 , 2026 | 01:21 AM

పదేళ్ల పాటు జైలులో ఉన్నాడనే కారణం చెప్పి దోషికి బెయిల్‌ ఇవ్వమని కోరతారా? అని న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

పదేళ్లు జైలులో ఉంటే బెయిల్‌ ఇవ్వాలా?: సుప్రీం ప్రశ్న

న్యూఢిల్లీ, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): పదేళ్ల పాటు జైలులో ఉన్నాడనే కారణం చెప్పి దోషికి బెయిల్‌ ఇవ్వమని కోరతారా? అని న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆంధ్రప్రదేశ్‌లో అటవీ శాఖ అధికారుల జంట హత్యల కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఖైదీ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఆ వ్యాఖ్యలు చేసింది.

గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం సంగం గ్రామానికి చెందిన తులసీ నాయక్‌ (ఏ-1) గొడ్డలితో ఇద్దరు ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్లను నరికి చంపాడు. ఈ కేసులో బెయిల్‌ ఇవ్వాలని కోరగా ధర్మాసనం స్పందిస్తూ.. పదేళ్లు జైలులో ఉన్నాడనే కారణంతో బెయిల్‌ ఎలా ఇస్తారని ప్రశ్నించింది. ప్రతివాదుల వాదనలు వినాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు ప్రతివాదిగా ఉన్న ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి.. తదుపరి విచారణను జనవరి 11కు వాయిదా వేసింది.

ఈ వార్తలనూ చదవండి:

చేతులెలా వచ్చాయ్‌!

నామినీ ఉంటేనే బీమా

Updated Date - Nov 24 , 2026 | 01:23 AM