మల్లన్న ఆర్జిత సేవా టికెట్లు విడుదల
ABN , Publish Date - Oct 26 , 2026 | 05:29 AM
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్ల ఆర్జితసేవ, దర్శన టికెట్లను నవంబరు మాసానికి సంబంధించి ఆదివారం విడుదల చేసినట్లు ట్రస్ట్‌బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు, ఈవో శ్రీనివాసరావు ప్రకటించారు.
ఆన్‌లైన్‌లో అందుబాటులో నవంబరు కోటా
శ్రీశైలం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్ల ఆర్జితసేవ, దర్శన టికెట్లను నవంబరు మాసానికి సంబంధించి ఆదివారం విడుదల చేసినట్లు ట్రస్ట్‌బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు, ఈవో శ్రీనివాసరావు ప్రకటించారు. ప్రధానంగా స్వామివారి స్పర్శ దర్శనం, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనాలతో పాటు 14 రకాలైన ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు. www.tms.ap.gov.in వెబ్‌సైట్‌లో కాని, మనమిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా కాని టికెట్లు పొందవచ్చని తెలిపారు. కార్తీకమాసంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఉదయాస్తమానసేవ, ప్రాతఃకాల, ప్రదోషకాల సేవలతో పాటు స్వామివారి గర్భాలయ, సామూహిక అభిషేకాలను తాత్కాలికంగా నిలుపుదల చేసినట్టు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం