శ్రీశైలంలో నేటి నుంచి కార్తీకమాసోత్సవాలు
ABN , Publish Date - Nov 10 , 2026 | 01:11 AM
శ్రీశైల క్షేత్రంలో మంగళవారం నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల కోసం దేవస్థానం అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా...
నెల రోజులు అభిషేకాలు నిలుపుదల
శని, ఆది, సోమ, పర్వదినాల్లో స్పర్శ దర్శనం రద్దు
శ్రీశైలం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రంలో మంగళవారం నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల కోసం దేవస్థానం అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివచ్చి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను ఈ మాసంలో దర్శించుకుంటారు. ఈనేపథ్యంలో నెలరోజులపాటు గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు పూర్తిగా నిలుపుదల చేసినట్టు, క్షేత్రంలోని పురాతన పంచమఠాలలో కొలువై ఉన్న శివలింగాలకు అభిషేకాలు నిర్వహించుకునేందుకు సిద్ధం చేసినట్టు ఆలయ ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. ప్రతి శని, ఆది, సోమ వారాలతో పాటు పర్వదినాల్లో కూడా స్వామివారి స్పర్శ దర్శనం నిలుపుదల చేసినట్టు తెలిపారు. భక్తులందరికీ అలంకార దర్శనం మాత్రమే కల్పించనున్నారు.
ఈ వార్తలనూ చదవండి: